ETV Bharat / bharat

PMGKAY: 'కొవిడ్​ సమయంలో 80 కోట్ల మందికి ఉచిత రేషన్​'

author img

By

Published : Aug 7, 2021, 11:50 AM IST

Updated : Aug 7, 2021, 12:46 PM IST

మధ్యప్రదేశ్​లో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ద్వారా లబ్ధిపొందిన వారితో వర్చువల్​గా మాట్లాడారు మోదీ. ఈ పథకం ద్వారా దాదాపు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్​ అందించినట్లు తెలిపారు.

Modi, PM Modi
మోదీ, నరేంద్ర మోదీ

కరోనా మహమ్మారి సమయంలో దేశంలోని 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు అందించినట్లు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. అందులో మధ్యప్రదేశ్​ నుంచి 5 కోట్ల మంది ఉన్నట్లు చెప్పారు.

ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్నా యోజన పథకం మధ్యప్రదేశ్​ లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మాట్లాడారు మోదీ.

Modi, PM
లబ్ధిదారులతో మోదీ మాటామంతి

" గడిచిన 100 ఏళ్లలో మానవాళి ఎదుర్కొన్న అతిపెద్ద విప్తతు కరోనా మహమ్మారి. ప్రజలు తప్పకుండా మాస్కులు ధరించటం కొనసాగించాలి. కరోనా వైరస్​ వ్యాప్తిని అడ్డుకునేందుకు శానిటైజర్లు వినియోగించటం, భౌతిక దూరం తప్పక పాటించాలి. కరోనా వైరస్​తో ఏర్పడిన సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భారత్​ పేదలకే తొలి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రధానమంత్రి గరీబ్​ కల్యాణ్​ అన్నా యోజన, ప్రధాన మంత్రి రోజ్​ఘర్​ యోజనల ద్వారా తొలి రోజు నుంచే పేదలకు ఆహారం, ఉపాధి కల్పించాం. వోకల్​ ఫర్​ లోకల్​ ప్రయత్నానికి మద్దతుగా నిలవాలి. పండుగ రోజుల్లో దేశంలోని చేతివృత్తుల వారిని ప్రోత్సహించేందుకు హస్తకళ వస్తువులను కొనుగోలు చేయాలి."

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

వరదలు, వర్షాల కారణంగా మధ్యప్రదేశ్​లో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయని మోదీ అన్నారు. 'చాలా మంది జీవితాలను వరదలు దెబ్బతీసింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం మీతో అండగా ఉంటుంది. మీకు తగిన సాయం చేసేందుకు కృషి చేస్తోంది' అని తెలిపారు.

Modi, PM
వర్చువల్​ వేదికగా..

ఇటీవలే మోదీ.. పీఎంజీకేఏవై పథకం ద్వారా లబ్ధిపొందిన గుజరాత్​ వాసులతో మాట్లాడారు.

ఇదీ చదవండి:PMGKAY scheme: 'చాలా కుటుంబాల్లో రేషన్ సమస్య తీరింది'

Last Updated :Aug 7, 2021, 12:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.