ETV Bharat / bharat

మోదీ భద్రతకు రూ.12కోట్ల సూపర్​ స్ట్రాంగ్​​ కార్​

author img

By

Published : Dec 28, 2021, 5:35 PM IST

pm modi new car, మోదీ కారు
మోదీ భద్రతకు రూ.12 కోట్ల మెర్సిడిస్​ కార్​

PM Modi new car: ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకు రూ.12కోట్ల ఖరీదైన 'మెర్సిడీస్‌-మేబాక్​ ఎస్‌-650 గార్డ్‌'ను వినియోగిస్తున్నారు. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ హైసెక్యూరిటీ ఎడిషన్‌‌, రేంజ్​రోవర్‌ వోగ్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌ను వినియోగించారు.

PM Modi new car: ప్రధాని నరేంద్ర మోదీ భద్రతకు స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సరికొత్త కారును తీసుకొంది. 'మెర్సిడీస్‌-మేబాక్​ ఎస్‌-650 గార్డ్‌'ను కొనుగోలు చేసింది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పర్యటన సందర్భంగా ప్రధాని ఈ కారులోనే హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకొన్నారు. ఈ కారు ఖరీదు రూ.12 కోట్లు పైమాటే. ఇది వీఆర్‌-10 స్థాయి భద్రతను కల్పిస్తుంది. సాయుధ దాడుల నుంచి ఈ కారు బలమైన రక్షణ ఇస్తుంది.

ఇటీవల స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ ప్రధాని భద్రతకు కొన్ని అవసరాలను గుర్తించింది. ఆయన వాహనాన్ని మార్చాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు ఎస్‌-650 గార్డ్‌ కార్లను కొనుగోలు చేసింది. ఒక దానిలో ప్రధాని ఉండగా.. మరో కారును డికాయ్‌(ప్రధాని ఉన్నట్లు తలపించే వాహనం)గా వినియోగిస్తారు.

PM Modi upgrades to rs 12 crore car

గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ మహీంద్రా స్కార్పియో వినియోగించేవారు. ఆ తర్వాత ప్రధాని అయ్యాక బీఎండబ్ల్యూ 7 సిరీస్‌ హైసెక్యూరిటీ ఎడిషన్‌‌, రేంజ్​రోవర్‌ వోగ్‌, టయోటా ల్యాండ్‌ క్రూయిజర్‌లను వినియోగించారు.

Mercedes maybach s650

కొత్త కారులో ప్రత్యేక ఫీచర్లు ఇవే..

  • విలాసవంతమైన ఎస్‌-650 గార్డ్‌ కారు వినియోగదారులకు అత్యున్నత శ్రేణి రక్షణ కల్పించేలా మెర్సిడీస్‌ జాగ్రత్తలు తీసుకొంది. కారు బాడీ, విండోస్‌ ఏకే-47 తూటాలను తట్టుకొని నిలబడతాయి.
  • కారుకు ఈవీఆర్‌ (ఎక్సప్లోజివ్‌ రెసిస్టెంట్‌ వెహికల్‌) 2010 రేటింగ్‌ లభించింది. ఇది దాదాపు రెండు మీటర్ల దూరంలోపు జరిగే 15 కిలోల టీఎన్‌టీ పేలుడు శక్తిని నుంచి ప్రయాణికులకు కాపాడుతుంది. కారు విండోస్‌కు పాలీకార్బొనేట్‌ ప్రొటెక్షన్‌ ఇస్తుంది. కారు కింద జరిగే పేలుడు నుంచి తట్టుకొనేలా రక్షణ ఏర్పాట్లు ఉన్నాయి.
  • ఇక విషవాయువులతో దాడి జరిగినా.. లోపల ఉన్న వీవీఐపీని రక్షించేలా కారు లోపలే ప్రత్యేకమైన ఆక్సిజన్‌ సరఫరా విభాగం ఉంది.
  • ఈ వాహనంలో అత్యంత శక్తిమంతమైన 6.0లీటర్‌ ట్విన్‌ టర్బో ఇంజిన్‌ అమర్చారు. ఇది 516 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. 900ఎన్‌ఎం పీక్‌ టార్క్‌ను అందుకొంటుంది.
  • భారీ ఇంజిన్‌ ఉన్నా.. కారు వేగాన్ని గంటకు 160 కిలోమీటర్లకే పరిమితి చేశారు.
  • ఈ కారుకు ప్రత్యేకమైన టైర్లను వినియోగించారు. పంక్చర్లు పడినా.. దెబ్బతిన్నా ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు అవకాశం ఉంది.

ఇదీ చదవండి: Jabalpur collector: ఆ కారణంతో.. జీతం వద్దన్న కలెక్టర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.