ETV Bharat / bharat

Modi Italy Visit: ఇటలీ చేరుకున్న ప్రధాని మోదీ

author img

By

Published : Oct 29, 2021, 9:52 AM IST

Updated : Oct 29, 2021, 11:49 AM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటలీలోని రోమ్​ నగరానికి చేరుకున్నారు(modi italy visit). ఈ నెల 30-31 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సులో ఆయన పాల్గొననున్నారు.

ఇటలీ చేరుకున్న మోదీ

ఇటలీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోమ్​ నగరానికి(modi italy visit) చేరుకున్నారు. శని, ఆదివారాల్లో జరగనున్న జీ20 సదస్సులో(g20 summit 2021) పాల్గొనేందుకు ఇటలీ పర్యటన చేపట్టారు ప్రధాని.

ఇటలీ అధ్యక్షతన జరుగుతున్న జీ20 సదస్సుకు.. పీపుల్, ప్లానెట్, ప్రాస్పరిటీ అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. జీ20 సభ్యదేశాలు, ఇతర ఆహ్వానిత దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరవుతారు. మహమ్మారి అనంతరం ప్రపంచ ఆర్థిక, ఆరోగ్య సవాళ్లపై చర్చించనున్నారు.

పర్యటన పూర్తి వివరాలు..

రోమ్​కు చేరుకున్న (Modi Italy visit 2021) అనంతరం మహాత్మా గాంధీ విగ్రహం ఉన్న పియాజా గాంధీ ప్రాంతానికి మోదీ వెళ్లనున్నారు. అక్కడ మహాత్ముడికి నివాళులు అర్పిస్తారు. ప్రధానితో పాటు ఇటలీలోని భారత రాయబారి నీనా మల్హోత్రా అక్కడికి వెళ్తారు. రోమ్ మేయర్ రాబర్టో గువాల్టిరీ సైతం పియాజా గాంధీ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది.

అక్టోబర్ 30-31 తేదీల్లో జీ20 సమావేశంలో (G20 Summit 2021) మోదీ పాల్గొంటారు. పర్యటనలో (Modi Italy visit 2021) భాగంగా ఇటలీ ప్రధాని మారియో డ్రాగితో ద్వైపాక్షికంగా భేటీ కానున్నారు మోదీ. వీటితో పాటు మరికొన్ని ద్వైపాక్షిక భేటీలు నిర్వహిస్తారు. జీ20 సమావేశం అనంతరం గ్లాస్గోలో జరగనున్న కాప్26 వరల్డ్ లీడర్స్ సమిట్​లోనూ పాల్గొంటారు.

పోప్ ఫ్రాన్సిస్​తో భేటీ!

ఇటలీ పర్యటన రెండో రోజు క్రైస్తవ మతగురువు పోప్​ ఫ్రాన్సిస్​తో ప్రధాని భేటీ (Modi Pope Francis) అవుతారని సంబంధిత వర్గాలు తెలిపాయి. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ.. వాటికన్ సిటీకి వెళ్లి ఆయన్ను కలుస్తారని సమాచారం. పోప్​తో సమావేశం ఏ విధమైనదనే విషయంపై అధికారులు ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. అయితే, ఇరు దేశాల మధ్య ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా భేటీ ఉంటుందని తెలుస్తోంది.

ఇదీ చూడండి:- 'ఆసియాన్​ దేశాలతో స్నేహమే భారత్​కు ప్రధానం'

Last Updated :Oct 29, 2021, 11:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.