ETV Bharat / bharat

'ఆసియాన్​ దేశాలతో స్నేహమే భారత్​కు ప్రధానం'

author img

By

Published : Oct 28, 2021, 12:52 PM IST

Updated : Oct 28, 2021, 1:06 PM IST

ప్రధాని నరేంద్ర మోదీ 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సులో (Asean India Summit) వర్చువల్​గా పాల్గొన్నారు. పరస్పర సహకారంతోనే ఆసియాన్​ దేశాలు-భారత్​ మధ్య బంధం బలోపేతం అవుతుందని పేర్కొన్నారు.

18th ASEAN-India summit
ప్రధాని మోదీ

కొవిడ్​ ప్రభావం ఆసియన్​ దేశాలు-భారత్​ (Asean India Summit) మధ్య స్నేహానికి సవాల్​గా మారిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ సమయంలో పరస్పర సహకారంతోనే బంధం బలోపేతం చేయగలమని పేర్కొన్నారు. 18వ ఆసియాన్-భారత్ శిఖరాగ్ర సదస్సు (Asean India Summit) సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సదస్సులో వర్చువల్​గా పాల్గొన్న మోదీ.. ఆసియాన్​ దేశాలతో స్నేహమే భారత్​కు ప్రధానం అని స్పష్టం చేశారు.

'2022 నాటికి మన భాగస్వామ్యానికి 30 ఏళ్లు నిండుతాయి. భారత్​ కూడా 75 ఏళ్ల స్వాతంత్ర్యాన్ని పూర్తి చేసుకుంటుంది. ఈ మైలురాయికి గుర్తుగా వచ్చే ఏడాది ఆసియాన్​-భారత్​ ఐక్యత సంవత్సరంగా జరుపుకుందాం.'

-ప్రధాని నరేంద్ర మోదీ

ఆసియాన్ దేశాలతో పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, రక్షణ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడంపై ఈ సదస్సు వేదికగా భారత్​ దృష్టిసారించింది.

ఇదీ చూడండి : వ్యాపారి హత్యకు కుట్ర పన్నిన ఉగ్రవాది​ హతం

Last Updated :Oct 28, 2021, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.