ETV Bharat / bharat

'అదే భారత్​-మారిషస్​ సంబంధాలకు మూలస్తంభం'

author img

By

Published : Jan 20, 2022, 6:32 PM IST

భారత్​, మారిషస్​ సన్నిహత సంబంధాలకు బలమైన అభివృద్ధి భాగస్వామ్యమే మూల స్తంభమని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత సహకారంతో నిర్మించిన హౌసింగ్​ ప్రాజెక్టు, సోలార్​ ప్రాజెక్టు, సివిల్​ సర్వీసెస్​ కళాశాలను ఆ దేశ ప్రధానితో కలిసి ప్రారంభించారు.

Pravind Jugnauth
ప్రధాని మోదీ, ప్రవింద్​ కుమార్​ జుగ్నాథ్​

భారత్​, మారిషస్​ మధ్య సముద్రాల భద్రత సహా వివిధ రంగాల్లో సహకారం 'సాగర్​'(సెక్యూరిటీ అండ్​ గ్రోత్​ ఫర్​ ఆల్​ ఇన్​ ద రీజియన్​) విజన్​ను అమలులోకి తీసుకొచ్చిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. భారత్​ సాయంతో నిర్మించిన ఇళ్ల ప్రాజెక్టును ఆ దేశ ప్రధాని ప్రవింద్ కుమార్​​ జుగ్నాథ్​​తో కలిసి వర్చువల్​గా ప్రారంభించారు మోదీ. అలాగే.. భారత సహకారంతో చేపట్టిన 8 మెగావాట్ల సోలార్​ పవర్​ ప్రాజెక్టు, సివిల్​ సర్వీసెస్​ కళాశాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఇరుదేశల మధ్య సంబంధాలపై మాట్లాడారు ప్రధాని మోదీ. 2015లో మారిషస్​ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలోనే సముద్రాల భద్రతకు భారత సహకారంపై 'సాగర్​'కు పురుడుపోశారు.

" సముద్రాల భద్రత సహ ఇతర అంశాల్లో మా ధ్వైపాక్షిక సహకారం సాగర్​ విజన్​ను ఆచరణలోకి తీసుకురావటం చాలా సంతోషంగా ఉంది. సంస్కృతి, భాష, పూర్వీకుల నడవడిక.. భారత్​, మారిషస్​ ఒకటేనని చెబుతున్నాయి. ఈరోజు మా బలమైన అభివృద్ధి భాగస్వామ్యం.. ఇరు దేశాల సంబంధాల్లో మూలస్తంభంగా నిలిచింది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఈ సందర్భంగా మారిషస్​లో మెట్రో ఎక్స్​ప్రెస్​ ప్రాజెక్టు సహా ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణానికి లైన్​ ఆఫ్​ క్రెడిట్​ కింద​ 190 మిలియన్​ డాలర్లు అందించేందుకు ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే.. పలు అభివృద్ధి ప్రాజెక్టుల్లో సహకారంపై అవగాహన ఒప్పందాన్ని మార్చుకున్నారు ఇరు దేశాల అధికారులు.

మెట్రో ఎక్స్​ప్రెస్​ ప్రాజెక్టుకు మద్దతుగా నిలుస్తోన్న భారత్​కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు మారిషస్​ ప్రధాని ప్రవింద్​ కుమార్​ జుగ్నాథ్​​. ప్రధాన మెట్రో స్టేషన్లలో ఒకదానికి మహాత్మా గాంధీ పేరు పెట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: పాక్​లో పేలుడు.. భారతీయ వస్తువులు అమ్మే మార్కెట్​ లక్ష్యంగా...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.