ETV Bharat / bharat

అయోధ్య రాముడి కోసం మోదీ ఉపవాసం- కొబ్బరి నీళ్లు సేవిస్తూ, నేలపై నిద్రిస్తూ కఠోర దీక్ష

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 19, 2024, 2:34 PM IST

PM Modi Fast For Prana Pratishtha : అయోధ్య శ్రీరాముడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల దీక్ష చేస్తున్నారు. అందులో భాగంగా మోదీ కేవలం కొబ్బరినీళ్లు మాత్రమే తాగుతూ, నేలపైనే నిద్రిస్తున్నారని సమాచారం.

PM Modi Fast For Prana Pratishtha
PM Modi Fast For Prana Pratishtha

PM Modi Fast For Prana Pratishtha : అయోధ్య రామమందిరం ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ 11 రోజుల పాటు దీక్ష చేస్తున్నారు. ఆ దీక్షలో భాగంగా ఉపవాసం చేస్తున్న మోదీ కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని, నేలపై దుప్పటి కప్పుకుని నిద్రిస్తున్నారని సమాచారం. అంతే కాకుండా మోదీ 'గోపూజ' కూడా చేస్తున్నారని, గోవులకు ఆహారం ఇవ్వడం, అన్నదానం వంటి పలు రకాల కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నట్లు తెలుస్తోంది.

రామభక్తుడైన మోదీ గత కొన్ని రోజులుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శిస్తున్నారు. అందులో భాగంగా మాహారాష్ట్ర నాసిక్​లోని రామ్​కుండ్​ శ్రీకాల రామ దేవాలయం, ఆంధ్రప్రదేశ్​ లేపాక్షిలోని వీరభద్ర ఆలయం, కేరళలోని గురువాయుర్ ఆలయం, త్రిప్రయార్ శ్రీ రామస్వామి దేవాలయాలను దర్శించుకున్నారు. మరో రెండు రోజుల పాటు (జనవరి 20, 21) తమిళనాడులోని మరిన్ని ఆలయాలను ప్రధాని మోదీ సందర్శించనున్నారు. అయితే మోదీ సందర్శించే ఆలయాలకు శ్రీరాముడితో సంబంధం ఉందని తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలను సందర్శించడం, వివిధ భాషల్లో రామాయణం వినడం, భజనల్లో పాల్గొనడం చాలా ముఖ్యమైనదని, దాని ప్రభావం సాధారణ ప్రజలకు అర్థం కాదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 'ఏక్​ భారత్​ శ్రేష్ఠ్​ భారత్​' అనే ఆయన విజన్​కు అనుగుణంగా భారతీయ సామాజిక- సాంస్కృతిక భావనను బలోపేతం చేయాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నాయి. అందులో భాగంగానే దేవాలయాలను శుభ్రపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారని, తాను చెప్పింది ఆచరించి ప్రేరణగా నిలవడానికి నాసిక్​లోని శ్రీ కాలరామ ఆలయాన్ని మోదీ స్వయంగా శుభ్రం చేశారని చెప్పాయి.

'మోదీ ఇచ్చిన పిలుపు మేరకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆలయాలను శుభ్రపరిచారు. దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో ఉత్సాహంగా ప్లాల్గొన్నారు. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు, ప్రతి ఒక్కరు మోదీ పిలుపునకు స్పందించారు. అందుకే ఆ కార్యక్రమం సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.​' అని ఓ అధికారి తెలిపారు.

రాముడి విగ్రహ ప్రతిష్ఠాపనకు 55 దేశాల అతిథులు- అక్కడి నుంచే మోదీ ప్రసంగం

గర్భగుడిలో అయోధ్య రామయ్య- విగ్రహం తొలి ఫొటో చూశారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.