ETV Bharat / bharat

'దశాబ్దాల ఆశలు కుషీనగర్​ విమానాశ్రయంతో సాకారం'

author img

By

Published : Oct 20, 2021, 12:36 PM IST

ఎన్నో దశాబ్దాల ఆశలు, అంచనాలు ఫలితమే.. కుషీనగర్​ విమానాశ్రయం అన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఉత్తర్​ప్రదేశ్​లో కొత్తగా నిర్మించిన ఈ ఎయిర్​పోర్ట్​ను బుధవారం ప్రారంభించారు మోదీ.

PM inaugurates Kushinagar international airport
కుశీనగర్​ విమానాశ్రయం

ఉత్తర్​ప్రదేశ్​లోని కుషీనగర్​లో నిర్మించిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దశాబ్దాల ఆశలు, అంచనాలు ఫలించాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తర్​ప్రదేశ్​ గవర్నర్​ ఆనందిబెన్​ పటేల్​, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పాల్గొన్నారు. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుమారుడు, క్రీడా శాఖ మంత్రి రాజపక్స కూడా హాజరయ్యారు.

PM inaugurates Kushinagar international airport
మోదీకి బుద్ధ ప్రతిమ అందిస్తున్న సింధియా

కుషీనగర్​ ఎయిర్​పోర్ట్​ విమానయాన రంగానికి సరికొత్త శక్తిని ఇస్తుందని, పర్యటకం కొత్త పుంతలు తొక్కుతుందని అభిప్రాయపడ్డారు మోదీ. పెట్టుబడులు పెరుగుతాయని, ఉద్యోగాల కల్పన జరుగుతుందని అన్నారు.

PM inaugurates Kushinagar international airport
కుశీనగర్​ విమానాశ్రయం

''దశాబ్దాల తరబడి ఆశలు, ఎన్నో అంచనాల సాకారమే.. కుషీనగర్​ విమానాశ్రయం. ఈ రోజు నా సంతోషం రెట్టింపైంది. నా జీవిత ప్రయాణంలో ఇప్పుడు సంతృప్తి నెలకొంది.''

- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి

మందిరంలో పూజలు..

అనంతరం.. మహాపరినిర్వాణ మందిరాన్ని సందర్శించారు మోదీ. అక్కడ బుద్ధుడికి పూజలు చేసి.. విగ్రహానికి చీవర్​(ఒక వస్త్రం) సమర్పించారు. ఆ తర్వాత.. ఒక బోధి వృక్షం కూడా నాటారు.

PM inaugurates Kushinagar international airport
బోధి వృక్షం నాటి నీళ్లు పోస్తున్న ప్రధాని

అభిధమ్మ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మోదీ.. అక్కడ బౌద్ధ సన్యాసులకు కూడా చీవర్​లు అందజేశారు. శ్రీలంక, థాయిలాండ్​, మయన్మార్​, దక్షిణ కొరియా, నేపాల్​, భూటాన్​, కంబోడియా సహా ఇతర దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్​లో పాల్గొన్నారు.

తీర్థయాత్రలకు ఊతం..

కుషీనగర్‌ బౌద్ధులకు అత్యంత ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి. గౌతమ బుద్ధుడు.. తన చివరి రోజుల్లో (మహాపరినిర్వాణం) ఇక్కడే గడిపారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సాధువులు ఏటా ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా శ్రీలంకలో నివసించే బౌద్ధులు.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మార్గం సులభం కానుంది. వీరికి సౌలభ్యం కల్పించడం సహా బౌద్ధ తీర్థయాత్రను మరింత ప్రోత్సహించే విధంగా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. దాదాపు రూ.260కోట్లతో దీన్ని నిర్మించింది.

ఇదీ చూడండి: 'వారు ఎంతటి బలవంతులైనా విడిచిపెట్టేది లేదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.