ETV Bharat / bharat

పోలీసింగ్​లో విప్లవాత్మక మార్పులకు మోదీ కీలక సూచనలు

author img

By

Published : Nov 21, 2021, 8:58 PM IST

పోలీస్​ వ్యవస్థలో భవిష్యత్​ తరాలను దృష్టిలో ఉంచుకొని అందుకు సంబంధించిన సాంకేతికను అందిపుచ్చుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ (modi news) పిలుపునిచ్చారు. ఇందుకుగానూ కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్​ పోలీస్​ టెక్నాలజీ మిషన్​ను ఏర్పాటు చేయాలని సూచించారు.

high-power police tech mission
నరేంద్ర మోదీ

క్షేత్రస్థాయి పోలీసింగ్​ వ్యవస్థలో కీలకమైన టెక్నాలజీని రాబోయే రోజుల్లో అందిపుచ్చుకునేందుకు కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో హైపవర్​ పోలీస్​ టెక్నాలజీ మిషన్​ను ఏర్పాటు చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూలో (modi in lucknow) జరిగిన 56వ డీజీపీ, ఐజీపీ సభ ముగింపు సందర్భంగా (dgp meet lucknow) మోదీ ఈ మేరకు ప్రసంగించారు. పోలీస్​ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు కొన్ని సంఘటనలను విశ్లేషించి కేస్ స్టడీలను రూపొందించాలని కోరారు.

సామాన్య ప్రజల జీవితాల్లో సాంకేతికత ప్రాముఖ్యత గురించి ప్రస్తావించిన మోదీ.. కొవిన్​, జెమ్​ పోర్టల్​, యూపీఐ పేమెంట్స్​ లాంటివి దేశంలో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులను గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న పోలీసు బలగాలకు ప్రయోజనం చేకూర్చే ఇంటర్-ఒపేరబుల్​ టెక్నాలజీలను అభివృద్ధి చేయాలని ప్రధాని సూచించారు. కరోనా తరువాత పోలీసుల వైఖరిలో సానుకూల మార్పును గుర్తించినట్టు మోదీ ప్రశంసించారు. ప్రజల ప్రయోజనం కోసం డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించాలని మోదీ సూచించారు. 2014లో ప్రవేశపెట్టిన స్మార్ట్ పోలీసింగ్ కాన్సెప్ట్​ను సమీక్షించాలని కోరారు.

ఇదీ చూడండి: పోలీస్​ స్టేషన్ క్లీన్​ చేస్తుండగా భారీ పేలుడు.. ఐదుగురు...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.