ETV Bharat / bharat

కరోనాకు 'మందు'గా పవిత్రజలం- ఎగబడ్డ జనం

author img

By

Published : Jun 3, 2021, 5:47 PM IST

కరోనా వైరస్ నుంచి బయటపడేందుకు వైద్య చికిత్స తప్ప మరొకటి పనికిరాదని ప్రభుత్వం పదేపదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ ప్రజలు అశాస్త్రీయ చికిత్సా మార్గాలను ఎంచుకుంటున్నారు. మధ్యప్రదేశ్‌లో దేవతలమని చెప్పుకుంటున్న ఇద్దరు మహిళలు అందించే 'పవిత్ర జలం' కోసం ఎగబడ్డారు.

People throng shrine for Covid cure in MP
అంధవిశ్వాసాల ప్రోత్సాహం.. కరోనాకు పవిత్రజలం

కరోనా చికిత్సపై ప్రభుత్వాలు ఎంత అవగాహన కల్పిస్తున్నా ప్రజలు మూఢ విశ్వాసాలను వీడటం లేదు. కొవిడ్‌ నుంచి నివారణ లభిస్తుందంటూ వందలాది మంది గ్రామస్థులు ఓ ఆలయానికి తరలివచ్చారు. దేవతలమని చెప్పుకుంటున్న ఇద్దరు మహిళలు కొవిడ్‌ మహమ్మారి చికిత్స పేరిట పంపిణీ చేస్తున్న పవిత్ర జలాన్ని స్వీకరించేందుకు మధ్యప్రదేశ్‌ రాజ్‌గంజ్​‌లోని చాతు ఖేడా గ్రామంలో ఓ ఆలయం ముందు బారులు తీరారు.

People throng shrine for Covid cure in MP
ఆలయం ముందు పెద్దఎత్తున బారులు తీరిన ప్రజలు
People throng shrine for Covid cure in MP
మగ్గులతో 'పవిత్రజలం' పంపిణీ

ఇదీ జరిగింది..

ఇద్దరు మహిళల శరీరాల్లోకి దేవతలు ప్రవేశించారనే పుకార్లతో జనం భారీగా తరలివచ్చారు. వారిద్దరూ కరోనా చికిత్సలో భాగంగా.. ప్రజలపై పవిత్ర జలం చల్లుతూ.. ప్రసాదంగా కూడా ఇస్తున్నారని ప్రజలు తెలిపారు. దీనిని తీసుకున్న తర్వాత తమ గ్రామంలోకి కరోనా రాలేదని.. సోకినప్పటికీ వైరస్ హాని కలిగించదని వివరించారు.

People throng shrine for Covid cure in MP
'పవిత్రజలాన్ని' స్వీకరిస్తున్న ప్రజలు
People throng shrine for Covid cure in MP
దేవతనని చెప్పుకుంటున్న మహిళ

అయితే.. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం అన్నది లేకుండా వందలమంది ప్రజలు ఈ ప్రాంతంలో గుమిగూడటం వల్ల కరోనా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి మధ్యప్రదేశ్​లో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన తర్వాతే ఈ ఘటన జరగడం గమనార్హం.

ఇవీ చదవండి: 'కరోనా దుష్ప్రచారాల కట్టడి అత్యంత ఆవశ్యకం'

మితిమీరిన మూఢత్వంతో ప్రాణసంకటం

శాస్త్రీయ స్ఫూర్తిని ముంచుతున్న మూఢనమ్మకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.