ETV Bharat / bharat

జేఈఈ-మెయిన్స్​ పరీక్షలు వాయిదా!

author img

By

Published : Jun 23, 2021, 4:50 AM IST

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో 'జేఈఈ-మెయిన్స్​' సహా నీట్​ పరీక్షలు వాయిదా వేసేందుకు కేంద్రం యోచిస్తోంది. జేఈఈ-మెయిన్స్​ను జూలై నెలాఖరు లేదా ఆగస్టులో.. నీట్​ను సెప్టెంబరులో నిర్వహించాలని భావిస్తోంది.

jee exams postponed, jee mains in august
జేఈఈ-మెయిన్స్​ పరీక్షలు వాయిదా!

ఇంజినీరింగ్​ ప్రవేశాలకు సంబంధించి నిర్వహించాల్సి ఉన్న 'జేఈఈ-మెయిన్స్​' రెండు పరీక్షలను జులై నెలాఖరు లేదా ఆగస్టులో జరిపేందుకు కేంద్ర విద్యాశాఖ యోచిస్తోంది. అలాగే వైద్యవిద్య ప్రవేశపరీక్ష నీట్​ను సెప్టెంబరుకు వాయిదావేసే యోచనలో ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కొవిడ్ పరిస్థితిని సమీక్షించిన అనంతరం వీటిపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించాయి. 'జేఈఈ-మెయిన్స్​' రెండు పరీక్షలను రెండు వారాల వ్యవధిలో నిర్వహిస్తారని తెలిపాయి.

దేశంలో జేఈఈ-మెయిన్స్​ను ఏడాదికి 4 సార్లు నిర్వహిస్తారు. తొలి విడత ఫిబ్రవరిలోను, రెండో విడత మార్చిలోనూ నిర్వహించగా తదుపరి ఏప్రిల్​, మే నెలల్లో జరపాల్సిన రెండు పరీక్షలు కొవిడ్​ కారణంగా వాయిదా పడ్డాయి.

ఇదీ చదవండి : 20 ఏళ్ల నాటి కల.. ఆరు పదుల వయసులో డాక్టరేట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.