ETV Bharat / bharat

నెమలి చనిపోయినా దాని వెంటే.. నాలుగేళ్ల బంధాన్ని వీడలేక..

author img

By

Published : Jan 5, 2022, 3:43 PM IST

Peacock Video: చనిపోయిన ఓ నెమలిని ఒక సంచిలో పెట్టుకొని మోసుకెళ్తున్నారు ఇద్దరు యువకులు. వారి వెంట అలానే నడుస్తూ వెళ్తోంది తోటి నెమలి. హృదయాల్ని పిండేస్తున్న ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.

Peacock Refuses To Leave "Long Time Partner
Peacock Refuses To Leave "Long Time Partner

Peacock Video: అయిన వారు ఏ కారణంతోనైనా దూరమైతే ఆ బాధ మాటల్లో చెప్పలేం. ఇక వారు చనిపోతే.. ఆ బాధకు అంతే ఉండదు. ఏడుస్తారు.. డిప్రెషన్‌లోకి వెళ్తారు. మళ్లీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మనుషుల్లో ఈ భావోద్వేగం సహజం.. కానీ జంతువుల్లో, పక్షుల్లో కూడా ఇలా ఉంటుందంటే నమ్ముతారా? ఓ నెమలిలో అంత ఎమోషన్​ కనిపించింది.

వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్​ కుచేరాలో హృదయ విదారక దృశ్యం కనిపించింది. ఓ నెమలి మృతిచెందగా.. దానిని సంచిలో పట్టుకొని తీసుకెళ్తున్నారు ఇద్దరు యువకులు. వారి వెంటే నడుచుకుంటూ వెళ్తోంది మరో మయూరం. విగతజీవిగా పడి ఉన్న తన భాగస్వామిని అలా తీసుకెళ్తుంటే.. ఏం చేయాలో తెలియట్లేదు పాపం. మరణంలోనూ వదిలి వెళ్లలేక.. ఆ నెమలి దానినే అనుసరిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు.

హృదయాల్ని హత్తుకునే ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. భారత అటవీ శాఖ అధికారి పర్వీన్​ కాస్వాన్​.. సంబంధిత వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. తనకు వాట్సాప్​లో ఈ క్లిప్​ వచ్చిందని చెప్పారు.

ఇది రాజస్థాన్​ కుచేరాలో జరిగిందని మరో ట్వీట్​ చేశారు. ఆ రెండు నెమళ్లు నాలుగేళ్లు కలిసి జీవించినట్లు అందులో ఉంది.

దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. మనుషుల కంటే జంతువులు/పక్షులు ఎక్కువ ప్రేమ, ఆప్యాయత చూపించుకుంటాయని ఒకరు అన్నారు.

peacock video
నెటిజన్​ ట్వీట్​

ఒంటరైన పక్షి పట్ల మరికొందరు సానుభూతి వ్యక్తం చేస్తూ పోస్ట్​లు పెట్టారు.

peacock video
నెటిజన్​ ట్వీట్​

వైల్డ్​లైఫ్​కు సంబంధించి కాస్వాన్​ తరచూ ట్విట్టర్​లో వీడియోలు పోస్ట్​ చేస్తుంటారు. ఇవి వైరల్​గా మారుతుంటాయి.

ఇవీ చూడండి: Kenya Drought: మూగజీవాల మృత్యుఘోష- చుక్కనీరు లేక అల్లాడిపోయి..

30 ఏళ్ల తర్వాత 28 పిల్లలకు జన్మనిచ్చిన మొసలి

సముద్రమట్టానికి 3000 మీ. ఎత్తులో బెంగాల్​ టైగర్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.