ETV Bharat / bharat

'ఉత్తర కొరియాలా భారత పార్లమెంట్​- రాజ్యాంగం సమాధి'- సస్పెన్షన్లపై ఎంపీలు ఫైర్​

author img

By PTI

Published : Dec 19, 2023, 4:38 PM IST

Updated : Dec 19, 2023, 5:02 PM IST

Parliament Suspended MPs Reactions
Parliament Suspended MPs Reactions

Parliament Suspended MPs Reactions : అధికార బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సస్పెన్షన్​కు గురైన ఎంపీలు. పార్లమెంట్​ను రాజ్యాంగాన్ని సమాధి చేసే శ్మశానంగా, ఉత్తర కొరియా అసెంబ్లీగా అభివర్ణించారు.

Parliament Suspended MPs Reactions : పార్లమెంట్​ నుంచి సస్పెండ్​ చేయడం పట్ల బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు. పార్లమెంట్​ను రాజ్యాంగాన్ని సమాధి చేసే శ్మశానంగా, ఉత్తర కొరియా అసెంబ్లీగా అభివర్ణించారు. భద్రతా ఉల్లంఘన అంశాన్ని చర్చించకపోవడం బాధాకరమని, ఎంపీలను కాపాడడానికి బదులుగా వాళ్లను సస్పెండ్‌ చేస్తున్నారని కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. ప్రతిపక్షంలేని లోక్​సభను సృష్టిండమే ప్రభుత్వ ధ్యేయంగా కనిపిస్తోందని కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​ ధ్వజమెత్తారు. పార్లమెంట్​లో ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్న కోరిక వారిలో లేదని మండిపడ్డారు.

  • #WATCH | On suspension of more than 40 MPs from Lok Sabha, including his own, Congress MP Shashi Tharoor says, "...It is clear that they want an Opposition-mukt Lok Sabha and they will do something similar in Rajya Sabha. At this point, unfortunately, we have to start writing… pic.twitter.com/mh9LeXEgiB

    — ANI (@ANI) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"నా 15 ఏళ్ల పార్లమెంట్ కెరీర్‌లో భద్రతా వైఫల్యంపై చర్చించాలని మొదటిసారి వెల్‌లోకి దూసుకెళ్లి ప్లకార్డులు ప్రదర్శించాను. ఆ ఘటనపై వివరణ కోరిన సస్పెండ్‌ అయిన కాంగ్రెస్‌ మిత్రులకు సంఘీభావంగా నేనలా చేశాను."
-శశిథరూర్,కాంగ్రెస్ ఎంపీ

"నాకు మాట్లాడానికి మాటలు రావడం లేదు. కొత్త పార్లమెంట్​ కట్టేముందు వారు ఏం ఆలోచించారు? ప్రజస్వామ్యాన్ని సమాధి చేయాలని అనుకున్నారా? విపక్ష ఎంపీలందరిని బయటకు పంపారు. నిందితులకు పాసులు ఇచ్చిన ఎంపీపై మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు."
--హర్​సిమ్రత్​ కౌర్ బాదల్​, శిరోమణి అకాలీదళ్​ ఎంపీ

"పార్లమెంట్​ త్వరలోనే ఉత్తర కొరియా అసెంబ్లీగా మారిపోతుంది. ప్రధాని సభలోకి వస్తుంటే చప్పట్లు కొట్టడం మాత్రమే లేదు. అదీ త్వరలోనే జరుగుతుంది."
-కార్తీ చిదంబరం, కాంగ్రెస్ ఎంపీ

"భద్రతా వైఫల్యం ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసిన సభ్యలపై సస్పెన్షన్ వేటు విధించడం, పారదర్శకత, జవాబుదారీ సూత్రాలకు విరుద్ధం. పార్లమెంట్‌ భద్రతకు సంబంధించి వివరణ కోరే హక్కు సభ్యులకు ఉంటుంది. జరిగిన ఘటన ఎంత తీవ్రమైందో సభ్యుల నిరసనల ద్వారా తెలుస్తోంది. ఇలాంటివి పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు చేపడుతుందో ప్రభుత్వం ఒక ప్రకటన ద్వారా తెలియజేయాలి. కానీ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా వ్యవహరించడం ఆందోళన కలిగిస్తోంది."
--శరద్‌ పవార్, ఎన్​సీపీ అధినేత

"ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే పార్లమెంట్​లో ప్రతిపక్షం లేకుండా చేయడం దారుణం. ప్రస్తుతం బీజేపీ సొంత ఎజెండాతోనే ముందుకు వెళ్తోంది. మరోసారి అధికారంలోకి వస్తే అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని పూర్తిగా అంతం చేస్తారు"

--అఖిలేశ్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ అధినేత

  • VIDEO | "How will they now call it (the Parliament) a temple of democracy, when the opposition is thrown out in such a manner?" says Samajwadi Party chief @yadavakhilesh on suspension of MPs in Lok Sabha and Rajya Sabha. pic.twitter.com/jpwVnN9b8z

    — Press Trust of India (@PTI_News) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

141కు చేరిన ఎంపీల సస్పెన్షన్​
అంతకుముందు లోక్‌సభలో గందరగోళం సృష్టించిన మరో 49 మంది విపక్ష సభ్యులను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్నారని స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెండ్ అయిన వారిలో శశిథరూర్‌, ఫరూఖ్‌ అబ్దుల్లా, మనీశ్​ తివారి, సుప్రియా సూలే, కార్తి చిదంబరం, ఫైజల్‌, సుదీప్‌ బందోపాధ్యాయ, డింపుల్ యాదవ్‌, డానిష్‌ అలీ ఉన్నారు. ఇప్పటికే పార్లమెంటు నుంచి 78 మంది సభ్యులపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ఈ శీతాకాల సమావేశాల్లో ఇప్పటివరకు సస్పెన్షన్‌కు గురైన విపక్ష ఎంపీల సంఖ్య 141కు చేరింది. డిసెంబరు 13 నాటి ఈ భద్రతా వైఫల్యంపై హోం మంత్రి ప్రకటన చేయాలంటూ విపక్షాలు పట్టుబట్టిన నేపథ్యంలో తాజా పరిణామం జరిగింది. సభాపతి ఆదేశాలు ధిక్కరించిన సభ్యుల సస్పెన్షన్‌కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని మూజువాణి ఓటుతో లోక్‌సభ ఆమోదించింది. అనంతరం స్పీకర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

  • VIDEO | "This is going to resemble the North Korean Assembly. This is going to be a token house," says Congress MP @KartiPC on suspension of 49 Lok Sabha MPs. pic.twitter.com/mCt4JwUvC0

    — Press Trust of India (@PTI_News) December 19, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

పార్లమెంట్​లో ఆగని నిరసనలు- మరో 49మంది లోక్​సభ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు'

ఇలాంటి ప్రవర్తనతో 2024 ఎన్నికల్లో మరిన్ని సీట్లు కోల్పోతారు'- ప్రతిపక్షాల తీరుపై ప్రధాని మోదీ ఫైర్

Last Updated :Dec 19, 2023, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.