ETV Bharat / bharat

'లోక్​సభ ఘటన'- పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు- మనోరంజన్​ ఫ్రెండే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 21, 2023, 12:30 PM IST

Updated : Dec 21, 2023, 1:32 PM IST

Parliament Security Breach Case Karnataka Techie : పార్లమెంటు భద్రతా వైఫల్యం కేసులో దిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ఒకరు కర్ణాటకకు చెందిన వ్యక్తి టెకీ అని, అతడు మాజీ డీఎస్పీ కుమారుడని తెలిసింది.

Parliament Security Breach Case Karnataka Techie
Parliament Security Breach Case Karnataka Techie

Parliament Security Breach Case Karnataka Techie : పార్లమెంటులోకి చొరబడి అలజడి సృష్టించిన కేసులో దిల్లీ పోలీసుల దర్యాప్తు చురుగ్గా సాగుతోంది. ఈ క్రమంలో దిల్లీ పోలీసులు ప్రత్యేక విభాగం మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుంది. వారిలో ఒకరిది కర్ణాటక అని, మరొకరిది ఉత్తర్‌ప్రదేశ్ అని తేలింది. ఫేస్​బుక్​లో డిలీట్​ చేసిన భగత్​ సింగ్ ఫ్యాన్​ క్లబ్​లో సభ్యులని అనుమానిస్తున్నారు పోలీసులు. కర్ణాటకకు చెందిన వ్యక్తి మాజీ డీఎస్పీ కుమారుడు సాయికృష్ణ జగాలి అని పోలీసు వర్గాలు వెల్లడించాయి.

  • #WATCH | Police have detained a man from Karnataka's Bagalkote, who was accused D. Manoranjan's roommate during their engineering college days, in connection with the Parliament security breach case pic.twitter.com/ZSZj02C9vK

    — ANI (@ANI) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

లోక్‌సభలో అలజడి సృష్టించిన మనోరంజన్‌కు అతడు స్నేహితుడు. మైసూరుకు చెందిన మనోరంజన్‌, బాగల్‌కోటెకు చెందిన సాయికృష్ణ బెంగళూరులోని ఇంజినీరింగ్‌ కళాశాలలో కలిసి చదువుకున్నారు. విచారణలో భాగంగా మనోరంజన్‌ చెప్పిన వివరాల ఆధారంగా బుధవారం సాయంత్రం సాయికృష్ణను బాగల్‌కోటెలోని అతడి ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్నారు. అతడిని దిల్లీకి తరలించి విచారించనున్నారు. తాజా పరిణామాలపై సాయికృష్ణ సోదరి మీడియాతో మాట్లాడారు. "తన సోదరుడు ఎలాంటి తప్పు చేయలేదు. దిల్లీ పోలీసులు తన సోదరుడిని ప్రశ్నించారు. విచారణకు మేము పూర్తిగా సహకరించాం. చదువుకున్నప్పుడు సాయికృష్ణ, మనోరంజన్ ఒకే ఇంట్లో ఉండేవారు. ఇప్పుడు నా సోదరుడు ఇంటి నుంచి పని చేస్తున్నాడు' అని తెలిపారు.

సాయితో పాటు ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన మరొకరిని కూడా దిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిద్దరూ డిలీట్ చేసిన ఫేస్‌బుక్ పేజీలోని భగత్‌ సింగ్‌ ఫ్యాన్‌ క్లబ్ సభ్యులని తెలుస్తోంది. పార్లమెంటులోకి చొరబడే ముందు ఆ పేజీని నిందితులు క్రియేట్ చేశారు. తర్వాత తొలిగించారు. కొత్తగా అదుపులోకి తీసుకున్న ఇద్దరినీ స్పెషల్ సెల్ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు, పార్లమెంట్ భద్రతను సెంట్రల్​ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(CISF)కు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

లలిత్​ ఝా విప్లవ యోధుడు అంటూ పోస్టర్​
Parliament Security Breach Lalit Jha : పార్లమెంట్​ భద్రత వైఫల్యంలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న బిహార్​కు చెందిన లలిత్​ ఝా ఇంటి వద్ద అతికించిన పోస్టర్లు ప్రస్తుతం చర్చనీయాంశమయ్యాయి. ఆ పోస్టర్​లో నీలం ఆజాద్, మనోరంజన్ సాగర్, అమోల్ షిండే, మహేశ్ ఫోటోలు ఉన్నాయి. అలానే వీళ్లుందరూ విప్లవ యోధులు అని రాసి ఉంది. ఈ విషయంపై లలిత్​ ఝా కుటుంబ సభ్యులు స్పందించారు. బుధవారం సాయంత్రం హరియాణా, ముంబయికి చెందిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి వచ్చారని తెలిపారు. లతిత్​ పిరికివాడు కాదని విప్లవ యోధుడని అన్నారు.

'6 వాట్సాప్​ గ్రూపుల్లో 'లోక్​సభ' ఘటన నిందితులు- ఎప్పుడూ వాటి కోసమే చర్చ!'

50 బృందాలతో పార్లమెంట్​ ఘటన దర్యాప్తు- సోషల్​ మీడియా డేటా కోసం మెటాకు లేఖ

Last Updated : Dec 21, 2023, 1:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.