ETV Bharat / bharat

మణిపుర్​ హింసపై రెండోరోజూ రచ్చ.. పార్లమెంట్ సోమవారానికి వాయిదా

author img

By

Published : Jul 21, 2023, 11:13 AM IST

Updated : Jul 21, 2023, 2:38 PM IST

parliament monsoon session 2023 updates live
parliament monsoon session 2023 updates live

14:34 July 21

పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మణిపుర్ అంశంపై చర్చించాలని విపక్షాలు ఆందోళన చేయడం వల్ల సభలు శుక్రవారం కూడా సజావుగా సాగలేదు. ఉదయం భేటీ కాగానే వాయిదా పడ్డ సభలు.. తిరిగి సమావేశమైనప్పటికీ విపక్ష సభ్యులు శాంతించలేదు. దీంతో ముందుగా లోక్​సభ సోమవారానికి వాయిదా పడింది. అనంతరం 2.30 గంటలకు వాయిదా అనంతరం రాజ్యసభ భేటీ కాగా.. అక్కడ కూడా అదే పరిస్థితి కనిపించింది. ఫలితంగా రాజ్యసభ సైతం సోమవారానికి వాయిదా వేస్తూ సభాపతి నిర్ణయం తీసుకున్నారు.

12:14 July 21

విపక్షాల ఆందోళనతో లోక్​సభ మరోసారి వాయిదా పడింది. సభను సోమవారానికి (జులై 24కు) వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు.

12:02 July 21

వాయిదా అనంతరం లోక్​సభ 12 గంటలకు తిరిగి సమావేశమైంది. అయితే, విపక్ష సభ్యులు మణిపుర్ అంశంపై చర్చించాలని పట్టుబడుతూ నినాదాలు చేస్తున్నారు.

11:19 July 21

Rajya Sabha Adjourned : పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. మణిపుర్‌లో మహిళలపై అమానుష ఘటనపై విపక్షాల ఆందోళనలు, నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగా.. ఆందోళనల కారణంగా మధ్యాహ్నం 12 గంటలకు వరకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అటు రాజ్యసభలో కూడా మణిపుర్ అంశంపై విపక్షాలు ఆందోళన చేయడం వల్ల మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు వాయిదా పడింది.

11:00 July 21

మణిపుర్​ హింసపై చర్చకు విపక్ష నేతల పట్టు.. లోక్​సభ వాయిదా

Manipur Violence : మణిపుర్​లో అల్లర్లపై విపక్షాలు చర్చకు పట్టుబడుతున్న నేపథ్యంలో వర్షాకాల సమావేశాల్లో రెండో రోజూ లోక్​సభ వాయిదా పడింది. అంతకుముందు మణిపుర్ హింసపై చర్చ చేపట్టాలని రాజ్యసభలో పలువురు విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అంతకుముందు పార్లమెంటులో ఇండియా కూటమి నేతలు మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో భేటీ అయ్యారు. పార్లమెంట్ ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు.

Last Updated :Jul 21, 2023, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.