ETV Bharat / bharat

జనావాసాల్లో చిరుత హల్​చల్​ .. ఇళ్లపై జంప్ చేస్తూ...

author img

By

Published : Dec 19, 2021, 3:42 PM IST

Panther In Jaipur Residential Area: రాజస్థాన్​ జైపుర్​లో చిరుత హల్​చల్ చేసింది. జనావాస ప్రాంతంలోకి వచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. ఒక ఇంటి మీద నుంచి మరో ఇంటిమీదకు వెళ్తూ.. నగరవాసులను బెంబేలెత్తించింది.

Panther Caught At Jaipur
చిరుత సంచారం

చిరుత సంచారం

Panther In Jaipur Residential Area: రాజస్థాన్​ జైపుర్​లోని మాళవియా నగర్ సెక్టార్​7​లో ఆదివారం ఉదయం చిరుత సంచారం కలకలం రేపింది. చిరుత ఒక ఇంటి మీద నుంచి మరో ఇంటిపైకి దూకుతూ.. కాలనీలో కొద్దిసేపు భయానక వాతావరణాన్ని సృష్టించింది. చిరుతను చూసిన ప్రజలు.. ఎత్తయిన భవనాలపైకి వెళ్లి వీడియోలు తీశారు.

Panther Caught At Jaipur
ఇంటిమేడపై చిరుత హల్​చల్
Panther Caught At Jaipur
ఇంటిపై చిరుత సంచారం

సమాచారం అందుకున్నఅటవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరించారు. చాలాసేపు ప్రయత్నించి అతికష్టం మీద చిరుతను పట్టుకున్నారు. చిరుతను నహర్​ఘర్ సంరక్షణ కేంద్రానికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం.. అడవిలో వదిలిపెట్టారు.

Panther Caught At Jaipur
గోడ ఎక్కేందుకు యత్నిస్తున్న చిరుత
Panther Caught At Jaipur
గోడపై కూర్చున్న చిరుత

ఆహారం, నీళ్లు వెతుక్కుంటూ ఒక్కోసారి చిరుతలు.. జనావాసాల్లోకి వస్తాయని అటవీ అధికారులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం జైపుర్​లోని మోతీ దంగ్రీ ప్రాంతంలోనూ ఓ చిరుత హల్​చల్​ చేసిందన్నారు. ఆ చిరుతను సంరక్షించామని తెలిపారు.

ఇదీ చూడండి: ఫైరింగ్ ప్రాక్టీస్​లో​ అపశ్రుతి.. జవాను మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.