ETV Bharat / bharat

'పోలీసులకు ఫిర్యాదు చేయకు.. రూ.2 లక్షలు ఇస్తాం'.. అత్యాచార బాధితురాలికి గ్రామపెద్దల రిక్వెస్ట్​!

author img

By

Published : Dec 12, 2022, 10:20 PM IST

తనపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఉంటే బాధితురాలి కుటుంబానికి రూ.2 లక్షలు ఇస్తామని అన్నారు పంచాయతీ పెద్దలు. ఈ అమానవీయ ఘటన బిహార్​లో వెలుగుచూసింది. మరోవైపు, కర్ణాటక బెంగళూరులో హృదయవిదారక ఘటన జరిగింది. 73 ఏళ్ల అత్యాచార నిందితుడిని కొట్టి చంపారు బాధితురాలి ముగ్గురు కుటుంబసభ్యులు.

Panchayat members offers
మైనర్​పై అత్యాచారం

బిహార్‌ పశ్చిమ చంపారణ్​ జిల్లాలోని బేతియాలో అమానవీయ ఘటన వెలుగుచూసింది. 14 ఏళ్ల అత్యాచార బాధితురాలికి రూ.2 లక్షలు ఇచ్చి తనపై జరిగిన దారుణాన్ని బయటకు తెలియకుండా అణిచివేసేందుకు ప్రయత్నించారు పంచాయతీ పెద్దలు. ఈ ఘటనపై బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
శుక్రవారం రాత్రి 10 గంటలకు బాధితురాలు ఇంటి బయట నిర్మించిన వాష్​రూమ్​కు వెళ్లింది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన శైలేంద్ర కుమార్(22) అనే యువకుడు బాధితురాలిపై దాడి చేసి.. చెరుకుపొలంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు ఇంటికి వెళ్లి జరిగిన విషయమంతా తన తల్లికి చెప్పింది. అయితే కొంతమంది పంచాయతీ పెద్దలు.. పోలీసులకు ఫిర్యాదు చేయవద్దని కోరారు. అందుకు రూ.2 లక్షలు ఇస్తామని తెలిపారు.

తల్లీబిడ్డలు మృతి..
పంజాబ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. మాన్సా ప్రభుత్వాసుపత్రికి ఓ గర్భిణీ ప్రసవానికి వచ్చింది. ప్రసవం అనంతరం తల్లీబిడ్డలు మరణించారని ఆస్పత్రి సిబ్బంది ఆమె కుటుంబసభ్యులకు తెలిపారు. దీంతో వారంతా ఆస్పత్రి బయట నిరసన చేపట్టారు. సరైన వైద్యం అందకే తల్లీబిడ్డలు మృతి చెందారని వారు ఆరోపించారు. సిబ్బంది.. వీడియో కాల్​ ద్వారా ప్రసవం చేశారని, అందుకే ఇలా జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి సిబ్బందిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.

ముగ్గురు విద్యార్థులు సూసైడ్​..
జీవితంలో ఉన్నతంగా స్థిరపడాలన్న కోరికతో వారంతా అప్పుడప్పుడే అడుగులు వేస్తున్నారు. మంచి కళాశాలల్లో సీటు తెచ్చుకోవాలన్న తపనతో పోటీపరీక్షల కోసం సన్నద్ధమవుతున్నారు. తమ కర్తవ్యాన్ని మర్చిపోయారో, ఒత్తిడిని తట్టుకోలేకపోయారో, లేదంటే ఇంకేం జరిగిందో తెలియదుగానీ ఒకే హాస్టల్లో ఉంటున్న ముగ్గురు విద్యార్థులు ఒకేసారి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన రాజస్థాన్‌లోని 'కోట' పట్టణంలో జరిగింది.

మృతులు ముగ్గురూ 18 ఏళ్ల లోపువారే కావడం గమనార్హం. వీరిలో ఇద్దర్ని బిహార్‌కు చెందిన అనుష్‌, ఉజ్వల్‌గా గుర్తించారు. వారిద్దరూ స్నేహితులే. కోటాలోని ఓ హస్టల్‌లో పక్క పక్క గదుల్లో ఉంటున్నారు. ఒకరు ఇంజినీరింగ్‌ కాలేజీ ప్రవేశ పరీక్ష కోసం సన్నద్ధమవుతుండగా.. మరొకరు మెడికల్‌ కాలేజీ ఎంట్రెన్స్‌ టెస్టు కోసం చదువుతున్నాడు. మరో విద్యార్థి ప్రణవ్‌ నీట్‌ పరీక్ష కోసం సన్నద్ధమయ్యేందుకు మధ్యప్రదేశ్‌ నుంచి వచ్చాడు. ఈ ముగ్గురూ ఒకే రోజు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేశారు. ఆత్మహత్య లేఖ లాంటి ఆధారాలేమీ లభించలేదన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు.

మైనర్​పై ఇమామ్​..
ఝార్ఖండ్ సిమ్డేగాలో దారుణం జరిగింది. ఓ మదర్సాలో ఎనిమిదేళ్ల మైనర్​పై ఇమామ్​ అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల మేరకు నిందితుడు ఇమామ్ అమీనుల్లాను పోలీసులు అరెస్ట్ చేశారు.

బాలికపై వృద్ధుడు..
కర్ణాటక బెంగళూరులో హృదయవిదారక ఘటన జరిగింది. 73 ఏళ్ల అత్యాచార నిందితుడిని కొట్టి చంపారు బాధితురాలి ముగ్గురు కుటుంబసభ్యులు. మృతుడిని కుప్పన్నగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
మద్యం మత్తులో ఉన్న కుప్పన్న 16 ఏళ్ల మైనర్​ను తన ఇంటికి తీసుకెళ్లాడు. శీతలపానీయంలో మత్తు మందు కలిపి బాధితురాలికి ఇచ్చాడు. అనంతరం బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి కోసం ఆమె తల్లిదండ్రులు వెతకగా.. నిందితుడి ఇంట్లో కనిపించింది. తనపై జరిగిన దారుణాన్ని బాలిక కుటుంబసభ్యులకు చెప్పింది. దీంతో కోపోద్రిక్తులైన వారు వృద్ధుడిపై దాడి చేసి హతమార్చారు.

విద్యార్థినిపై వైద్యుడు..
ఉత్తరాఖండ్ రుద్రపుర్​లో దారుణం జరిగింది. పంత్​నగర్​ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ వైద్యుడు. డిసెంబరు 5న జరిగిన జరిగిన ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. నిందితుడు దుర్గేష్ కుమార్ యాదవ్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం వల్ల విద్యార్థులు నిరసనలను విరమించారు.

దొంగతనం చేశాడని..
పంజాబ్​లోని శ్రీముఖ్తార్ సాహిబ్​లో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని ట్రక్కు ముందు భాగంలో కట్టి పోలీస్ స్టేషన్​కు తరలించాడు ఓ వ్యక్తి. ట్రక్కులో ఉన్న రెండు గోధుమల బస్తాలను దొంగిలిస్తూ డ్రైవర్​కు పట్టుబడడం వల్ల యువకుడిని ఇలా చేశాడు. ఆదివారం జరిగిందీ ఘటన.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.