ETV Bharat / bharat

చెంప దెబ్బకు రివెంజ్​.. ఇంటి యజమానిపై ఐదు రౌండ్ల కాల్పులు

author img

By

Published : Apr 23, 2022, 4:22 AM IST

Owner Shot Dead
చెంప దెబ్బకు రివెంజ్​

Owner Shot Dead: ఇంటి యజమానికి అతనికి మధ్య కొద్ది రోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో యజమాని ఆ వ్యక్తి చెంప మీద కొట్టాడు. ఇందుకు ప్రతీకారంగా యజమానిని హత్య చేయాలని నిశ్చయించుకున్న నిందితుడు అతనిపై ఐదురౌండ్ల కాల్పులు జరిపి దారుణంగా హత్య చేశాడు.

Owner Shot Dead: చెంప దెబ్బకు ప్రతీకారంగా ఇంటి యజమానిని దారుణ హత్య చేశాడో వ్యక్తి. ఈ ఘటన హరియాణా గురుగ్రామ్​లోని బిలాస్​పుర్​ ఖుర్ద్​ ప్రాంతంలో జరిగింది. నిందితుడు రోహ్​తక్​ జిల్లాకు చెందిన కైలాష్​గా గుర్తించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. నిందితుడిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. అతని నుంచి ఓ పిస్టోల్​, ఏడు బుల్లెట్లు, బైక్​ను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ జరిగింది.. నిందితుడు కైలాష్​ బిలాస్​పుర్​ ఖుర్ద్​లో ఓ దుకాణం యజమానైన దీపక్​ ఇంట్లో నివసించేవాడు. కొద్ది రోజుల క్రితం దీపక్​, కైలాష్​ల మద్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దీపక్​.. కైలాష్​ చెంప మీద కొట్టాడు. దీంతో తనను చెంపదెబ్బ కొట్టినందుకు ప్రతీకారంగా దీపక్​ను హతమార్చాలని నిశ్చయించుకున్నాడు కైలాష్. గురువారం సాయంత్రం.. బంధువుల ఇంటి నుంచి బయటకు వచ్చి కారు ఎక్కుతుండగా బైక్​పై వచ్చిన నిందితుడు దీపక్​పై ఐదు రౌండ్లు కాల్పులు జరిపాడు. పరారయ్యేందుకు ప్రయత్నించిన నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీపక్​ను ఆసుపత్రికి తరలించగా అతను అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధరించారు.

ఇదీ చూడండి : గర్భం దాల్చాలని ఖైదీ భార్య కోరిక.. భర్తకు 15 రోజులు పెరోల్ ఇచ్చిన కోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.