ETV Bharat / bharat

24 కి.మీ వెనక్కి దూసుకెళ్లిన ​రైలు- ఆపై బోల్తా

author img

By

Published : Dec 23, 2020, 11:33 AM IST

ఒడిశాలోని రూర్కెలాకు వెళ్తున్న ఓ గూడ్స్​ రైలు అదుపుతప్పి.. 24 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. లోకోపైలట్​ బ్రేకులు వేయగా.. పట్టాలు తప్పి నాలుగు బోగీలు ఒకదానిపై ఒకటి ఎక్కాయి.

Odisha: Goods Train Runs Reverse For 24 Kms; Four Bogies Derail at Bimalghar Junction
24కిమీ వెనక్కి దూసుకెళ్లిన గూడ్స్​ ​రైలు.. ఆపై బోల్తా

ఒడిశాలో ఓ గూడ్స్​రైలు అదుపుతప్పి సుమారు 24 కిలోమీటర్లు వెనక్కి వెళ్లింది. సుందర్​గఢ్​ జిల్లా బిమల్​గఢ్​ జంక్షన్​లో జరిగిన ఈ ఘటనలో ఓ రైల్వే ఉద్యోగి తీవ్రంగా గాయపడ్డారు.

24కిమీ వెనక్కి దూసుకెళ్లిన గూడ్స్​ ​రైలు.. ఆపై బోల్తా

ఇదీ జరిగింది..

ఇనుప ఖనిజాల లోడుతో ఓ గూడ్స్​ రైలు.. మంగళవారం సాయంత్రం 7 గంటలకు బరాసున నుంచి రూర్కెలాకు బయల్దేరింది. కొంత దూరం వెళ్లాక ఒక్కసారిగా అదుపుతప్పి 24 కిలోమీటర్లు వెనక్కి దూసుకెళ్లింది. అప్రమత్తమైన లోకోపైలట్​ బ్రేకులు వేయగా.. నాలుగు బోగీలు పట్టాలు తప్పి ఒకదానిపై మరొకటి ఎక్కాయి. బిమల్​గఢ్​ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న రైల్వే ఉద్యోగి ఎన్​కే ఛటర్జీకి తీవ్రంగా గాయాలయ్యాయి.

రైల్వే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చదవండి: రైతు నిరసనల్లో భాగంగా కర్షకుల యాగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.