ETV Bharat / bharat

కరోనా కాటుతో ఊపిరి తీసుకున్న దంపతులు

author img

By

Published : May 1, 2021, 12:29 PM IST

కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది జీవితాలు విషాదాంతం వార్తలు అనేకం వెలుగులోకి వస్తున్నాయి. భయంతో కొందరు.. విరక్తితో మరికొందరు మహమ్మారి సోకగానే ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఒడిశాలోని దంపతులు కరోనా సోకిందనే భయంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Odisha: Couple infected with coronavirus commits suicide in nayagarh
ఒడిశా దంపతులు మృతి

కరోనా పాజిటివ్​గా తేలిన దంపతులు బతుకు మీద భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. దీనితో మహమ్మారితో చికిత్స పొందుతున్న వీరి కుమారుడు అనాథగా మిగిలాడు. ఈ ఘటన ఒడిశాలోని నాయగఢ్ జిల్లాలో జరిగింది.

కరోనా సోకిందని తెలియగానే ఈ దంపతులు తీవ్ర నిరాశలో మునిగిపోయినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ క్రమంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. కొద్ది రోజులుగా వీరి ఇంట్లో నుంచి ఏ విధమైన చప్పుడు వినిపించడం లేదని ఇరుగు పొరుగువారు తెలిపారు.

ఇవీ చదవండి: పీపీఈ కిట్​తో అంబులెన్స్​ డ్రైవర్​ డ్యాన్స్

కొవిడ్​ వార్డులో నీళ్లు లేక రోగి మృతి.. వీడియో వైరల్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.