ETV Bharat / bharat

'బలవంతమేమీ లేదు.. నచ్చితేనే టీకా తీసుకోవచ్చు'

author img

By

Published : Jan 17, 2022, 11:14 AM IST

Updated : Jan 17, 2022, 11:36 AM IST

COVID VACCINE
COVID VACCINE

No forced vaccination: దేశంలో బలవంతంగా టీకాలు ఇవ్వడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లబ్ధిదారులు తమ అభీష్టం మేరకే టీకాను తీసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

Forced vaccination India: కరోనా టీకా తప్పనిసరిగా తీసుకోవాలని ఎవరిపైనా ఒత్తిడి చేయడం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కొవిడ్​ వ్యాక్సిన్​ పంపిణీపై కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు సైతం.. అనుమతి లేకుండా చేసే బలవంతపు వ్యాక్సినేషన్​ను పేర్కొనడం లేదని తెలిపింది.

India vaccination rules

టీకా ధ్రువపత్రం తప్పనిసరి అనే నిబంధన నుంచి దివ్యాంగులను మినహాయించాలని ఓ ఎన్​జీఓ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్​కు స్పందనగా.. కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించింది. వ్యాక్సినేషన్ ధ్రువపత్రం తప్పనిసరి అన్న నిబంధనను ఇంతవరకు విధించలేదని స్పష్టం చేసింది.

"ప్రస్తుత కరోనా సమయంలో వ్యాక్సినేషన్ అనేది ప్రజలందరి ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టే కార్యక్రమం. వివిధ పత్రికలు, మాధ్యమాల ద్వారా దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తున్నాం. టీకా పంపిణీకి చేసిన ఏర్పాట్లు, కావాల్సిన అర్హతలపై వివరాలు తెలియజేస్తున్నాం. అయితే, ఇష్టం లేకుండా ఏ వ్యక్తికీ బలవంతంగా టీకా వేయడం లేదు."

-సుప్రీంకోర్టులో కేంద్రం

దివ్యాంగులకు టీకా పంపిణీ విషయమై ఎవారా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. దివ్యాంగులకు ఇంటింటికి వెళ్లి టీకా వేసేలా చూడాలని ధర్మాసనాన్ని కోరింది.

ఇదీ చదవండి: లాటరీ టికెట్ కొన్న గంటలకే.. రూ.12 కోట్ల జాక్​పాట్

Last Updated :Jan 17, 2022, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.