ETV Bharat / bharat

ప్రత్యేక హోదా కోసం బిహార్ మంత్రివర్గం తీర్మానం

author img

By PTI

Published : Nov 22, 2023, 3:46 PM IST

Updated : Nov 22, 2023, 4:09 PM IST

Nitish Kumar on Bihar Special Status
Nitish Kumar on Bihar Special Status

Nitish Kumar on Bihar Special Status : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించింది బిహార్​ కేబినెట్. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం సోషల్​ మీడియా వేదికగా పోస్ట్ చేశారు నీతీశ్​.

Nitish Kumar on Bihar Special Status : బిహార్​కు ప్రత్యేక హోదా డిమాండ్​తో మరో ముందడుగు వేసింది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు​ తీర్మానాన్ని కేబినెట్ ఆమోదించిందని వెల్లడించారు ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్​. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం సోషల్​ మీడియా వేదికగా సుదీర్ఘ పోస్ట్ చేశారు నీతీశ్​. దీంతో పాటు కులగణనలో నిరుపేదలుగా తేలిన 94 లక్షల కుటుంబాల సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఎస్​సీ, ఎస్​సీ, ఎస్​టీ, ఓబీసీల రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతుందని గుర్తు చేశారు.

"బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర కేబినెట్​ తీర్మానాన్ని ఆమోదించింది. 94లక్షల నిరుపేద కుటుంబాల్లోని ప్రతి ఒక్కరికి దశలవారీగా రూ.2లక్షల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. గుడిసెల్లో నివసించే 39 లక్షల కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మిస్తాం. అందుకోసం రూ.1,20 లక్షలు ఇస్తాం. స్థలం లేని కుటుంబాల కోసం తొలుత రూ.60వేలు ఇవ్వాలని అనుకున్నాం. దానిని ఇప్పుడు లక్ష రూపాయాలకు పెంచాలని నిర్ణయించాం. దీని వల్ల 63,850 మందికి ప్రయోజనం చేకూరుతుంది. ఈ పథకాల అమలుకు సుమారు రూ.2.50 లక్షల కోట్లు అవుతుందని అంచనా. వీటిని ఐదేళ్ల లోపు అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

కానీ, ప్రత్యేక హోదా ఇస్తే.. వీటిని పూర్తి చేయడానికి తక్కువ సమయం పడుతుంది. మా డిమాండ్​ను పరిశీలించేందుకు మాజీ ఆర్​బీఐ గవర్నర్ రఘురాం రాజన్​ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. 2017లో ఆ కమిటీ నివేదిక ఇచ్చినా ఏం ప్రయోజనం లేదు. బిహార్​కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని మరోసారి కోరుతున్నాం. బిహార్​ ప్రజల అవసరాల దృష్ట్యా మా డిమాండ్​కు ఆమోదం తెలపాలని కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం

--నీతీశ్ కుమార్​, బిహార్ ముఖ్యమంత్రి

  • बिहार को विशेष राज्य का दर्जा प्रदान करने की पुनः मांग की।

    देश में पहली बार बिहार में जाति आधारित गणना का काम कराया गया है। जाति आधारित गणना के सामाजिक, आर्थिक एवं शैक्षणिक स्थिति के आंकड़ों के आधार पर अनुसूचित जाति के लिये आरक्षण सीमा को 16 प्रतिशत से बढ़ाकर 20 प्रतिशत,…

    — Nitish Kumar (@NitishKumar) November 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

గతేడాది వరకు బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని నడిపిన నీతీశ్​ కుమార్​.. ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చారు. అనంతరం ఆర్​జేడీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విపక్ష కూటమి ఇండియా ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.

SC, ST, OBC రిజర్వేషన్లు పెంచిన బిహార్​- 65శాతానికి చేరిన కోటా

అసెంబ్లీలో జనాభా నియంత్రణ- మహిళల విద్యపై నీతీశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు, మీడియా సాక్షిగా క్షమాపణలు

Last Updated :Nov 22, 2023, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.