'3వేల కిలోల డ్రగ్స్'​ కేసులో కీలక పత్రాలు స్వాధీనం

author img

By

Published : Oct 9, 2021, 9:19 PM IST

nia latest news

గుజరాత్​లోని ముంద్రా పోర్టులో పట్టుబడిన 3వేల కిలోల డ్రగ్స్​ కేసు విచారణను ముమ్మరం చేసింది జాతీయ దర్యాప్తు సంస్థలో (NIA Latest News). పలు రాష్ట్రాల్లో శనివారం సోదాలు చేపట్టి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.

గుజరాత్​లోని ముంద్రా పోర్టు డ్రగ్స్‌ కేసులో (Mundra Port Drugs News) విచారణను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ముమ్మరం చేసింది. విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్‌లో శనివారం (NIA Latest News) దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, సామగ్రిని ఎన్‌ఐఏ అధికారులు సీజ్‌ చేశారు. కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు.

ఏమిటీ కేసు?

గుజరాత్​లోని ముంద్రా పోర్టులో (Gujarat Mundra Port News) ఇటీవలే 2,988 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ నార్కోటిక్స్‌ కేసు విచారణ కొద్ది రోజుల క్రితం ఎన్‌ఐఏకు బదిలీ అయింది. ఎన్‌ఐఏ దర్యాప్తు కొనసాగించేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే డీఆర్‌ఐ నుంచి ఎన్‌ఐఏ ఈ కేసును (Mundra Port Drugs Case) స్వాధీనం చేసుకుంది. నార్కోటిక్స్‌ వ్యవహారంలో విదేశీ ఉగ్రవాద మూలాలు ఉన్నట్టు భావించిన కేంద్రం ఈ కేసును ఎన్‌ఐఏకు (NIA Latest News) అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి మాదక ద్రవ్యాల దిగుమతిపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేయనుంది.

అతడిదే కీలక పాత్ర?

గత నెల 15న ముంద్రా నౌకాశ్రయంలో పట్టుబడ్డ (Mundra Port Drugs) హెరాయిన్‌ వెనుక పాత్రధారి తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడికి చెందిన మాచవరం సుధాకర్‌ అయితే.. సూత్రధారి మాత్రం మాదకద్రవ్యాల మాఫియాలో కింగ్‌పిన్‌ అయిన దిల్లీ వాసేనని కేంద్ర నిఘా, దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌ నుంచి ఇరాన్‌ మీదుగా విజయవాడ చిరునామాతో ఉన్న ఆషీ ట్రేడింగ్‌ కంపెనీకి వస్తున్న ఈ మాదకద్రవ్యాన్ని (Mundra port drugs) దిల్లీకి చేర్చాలనేది వారి వ్యూహమని గుర్తించాయి. నిఘా, దర్యాప్తు సంస్థల దృష్టిలో పడకుండా ఉండేందుకు విజయవాడ సత్యనారాయణపురం చిరునామాతో కంపెనీని ప్రారంభింపజేసి దాన్ని చీకటి కార్యకలాపాలకు వినియోగించినట్లు నిర్ధరణకొచ్చాయి.

ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా ద్వారపూడి గ్రామానికి చెందిన మాచవరం సుధాకర్‌ ఇందులో పాత్రధారి అయ్యాడని, తన భార్య పేరిట ఆషీ ట్రేడింగ్‌ కంపెనీని రిజిస్టర్‌ చేయించి, దాన్ని మాదకద్రవ్యాల సరఫరా ముఠాలకు అందించాడని తేల్చాయి. ఈ ఏడాది జూన్‌లో కూడా ఈ కంపెనీ పేరుతో టాల్కం పౌడర్‌ ముసుగులో దాదాపు 25 టన్నుల హెరాయిన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి దిగుమతై.. కాకినాడ పోర్టు ద్వారా దిల్లీ సహా దేశంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినట్లు గుర్తించాయి.

ఇదీ చూడండి: డ్రగ్స్ ​కేసుపై మహారాష్ట్ర మంత్రి సంచలన ఆరోపణలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.