ETV Bharat / bharat

పంజాబ్​లో 'టీ పాలిటిక్స్'​- వివాదానికి తెరపడినట్టేనా?

author img

By

Published : Jul 19, 2021, 4:03 PM IST

Updated : Jul 19, 2021, 4:29 PM IST

పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ నియమితులైన సందర్భంగా కొత్త కార్యవర్గం.. ఆ రాష్ట్ర మంత్రి త్రిపట్​ రాజిందర్​ సింగ్​ బజ్వా నివాసంలో తొలిసారి సమావేశమైంది. ఈ సందర్భంగా నేతలంతా ఫొటోలకు పోజులిచ్చారు. పార్టీ ఐక్యంగా ఉందని తెలిపారు పీసీసీ మాజీ అధ్యక్షుడు సునీల్​ జఖర్​.

Punjab Congress president Navjot Singh Sidhu
పంజాబ్​ కాంగ్రెస్​ కొత్త కార్యవర్గం

పంజాబ్​ కాంగ్రెస్​ పునర్​వ్యవస్థీకరణలో భాగంగా నియామకమైన కొత్త కార్యవర్గం తొలిసారి సమావేశమైంది. పంజాబ్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ(పీపీసీసీ) అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ, కార్యనిర్వాహక అధ్యక్షుడు కుల్జిత్​ సింగ్​ నగ్రా, మాజీ పీపీసీసీ అధ్యక్షుడు సునీల్​ జఖర్​ సహా ఇతర నేతలు.. ఛండీగఢ్​లోని ఆ రాష్ట్ర మంత్రి త్రిపట్​ రాజిందర్​ సింగ్​ బజ్వా నివాసంలో భేటీ అయ్యారు. అనంతరం నేతలంతా.. ఫొటోలకు పోజులిచ్చారు.

Punjab Congress president Navjot Singh Sidhu
ఫొటోకు పోజులిస్తోన్న కొత్త కార్యవర్గం
Punjab Congress president Navjot Singh Sidhu
నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ, కాంగ్రెస్​ నేతలు

ఈ సందర్భంగా రాష్ట్ర రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై కీలక వ్యాఖ్యలు చేశారు పీసీసీ మాజీ అధ్యక్షుడు జఖర్​.

"ఇది పార్టీ సమావేశం కాదు. పీసీసీ కొత్త అధ్యక్షుడిగా సిద్ధూ నియామకైన సందర్భంగా ఆయనకు స్వాగతం పలుకుతూ.. త్రిపట్​ రాజిందర్​ సింగ్​ బజ్వ తేనీటి విందు ఏర్పాటు చేశారు. పార్టీ ఐక్యంగా ఉంది. మాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ప్రజలు మాకు రెండిట మూడోంతుల మెజారిటీ ఇచ్చారు. ఆ నమ్మకాన్ని మరింత బలపరచాల్సిన బాధ్యత మాపై ఉంది."

- సునీల్​ జఖర్​, పీసీసీ మాజీ అధ్యక్షుడు.

సిద్ధూకు ముఖ్యమంత్రి అమరిందర్​ సింగ్​ అభినందనలు తెలపకపోవటంపై అడిగిన ప్రశ్నకు.. ఆయన పదవికన్నా.. మనసు చాలా గొప్పదని, ఎలాంటి సందేహాలు లేవన్నారు సునీల్​ జఖర్​. ప్రతి ఒక్కరికీ తమ సొంత ఆలోచన ఉంటుందని, ఉదయంలోపు ప్రటన వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

'ప్రయాణం ఇప్పుడే మొదలైంది.. '

' నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది' అని పేర్కొన్నారు పంజాబ్​ కాంగ్రెస్​ కొత్త అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ. పీసీసీ అధ్యక్ష పదవి అప్పగించినందుకు అధిష్ఠానానికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయటం, 'పంజాబ్​ గెలుపు మిషన్'​ను సాధించేందుకు.. కాంగ్రెస్​ కుటుంబంలోని ప్రతి ఒక్కరితో కలిసి పనిచేస్తానని చెప్పారు.

" పంజాబ్​లోని కాంగ్రెస్​ అజేయ కోటను బలోపేతం చేసేందుకు కృషి చేస్తా. కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్​ గాంధీ, ప్రియాంక గాంధీ నాపై నమ్మకం ఉంచి, కీలక బాధ్యతలు అప్పగించినందుకు వారికి నా కృతజ్ఞతలు."

- నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ, పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడు.

భారత తొలి ప్రధాని జవహర్​లాల్​ నెహ్రూతో తన తండ్రి దిగిన ఫొటోను ట్విట్టర్​లో షేర్​ చేశారు సిద్ధూ. తన తండ్రి రాయల్​ జీవితాన్ని వదిలి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు.

Navjot Singh Sidh
సిద్ధూ ట్వీట్​

ఇదీ చూడండి:పంజాబ్‌ పీసీసీ అధ్యక్షుడిగా నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ

Last Updated : Jul 19, 2021, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.