ETV Bharat / bharat

Navratri Special Mehndi designs : నవరాత్రి మెహందీ.. ఈ అద్భుతమైన డిజైన్లు మీకోసం!

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 20, 2023, 11:02 AM IST

Updated : Oct 20, 2023, 11:08 AM IST

Navratri Special Mehndi designs : నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అయితే.. పండగ సందడి అంటే ఆడవాళ్లదే. రంగులు.. మెరుపులతో.. ఉత్సవాలు కళకళలాడాలంటే అమ్మాయిలు ఉండాల్సిందే. మిలమిలా మెరిసిపోతూ వాళ్లు రెడీ అయితే.. చూడ్డానికి రెండు కళ్లూ చాలవు. అయితే.. వాళ్ల మేకోవర్​లో చాలా అంశాలు ఉన్నప్పటికీ.. అందులో మెహందీ పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. అందుకే.. ఈ దసరా ఉత్సవాల వేళ స్పెషల్ మెహందీ డిజైన్స్​.. మీ కోసం తీసుకొచ్చాం.

Navratri Mehndi Special designs
Navratri Special Mehndi designs

Navratri Special Mehndi designs : అమ్మాయిల జీవితంలో మెహందీకి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. భారీ ఫంక్షన్స్​ జరిగినా.. లేదంటే.. ఏ చిన్న వేడుక జరిగినా.. వారి చేతులు ఎర్రగా పండాల్సిందే. ఇక పెళ్లి వేడుకల వేళ ప్రత్యేకంగా మెహందీ ఫంక్షనే ఉంటుంది. మహిళలు మెహందీకి అంతగా ప్రాముఖ్యత ఇస్తారు మరి! అయితే.. ఇప్పుడు దీవీ శరన్నవరాత్రులు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల వేళ కూడా ప్రత్యేకంగా మెహందీ డిజైన్లు వేసుకుంటూ.. సంబరాల్లో మునిగిపోతారు.

నవరాత్రి ఉత్సవాలను ఒక్కోచోట ఒక్కోవిధంగా జరుపుకుంటారు. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలుగా జరుపుకుంటారు. ఇతర ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలుగా నిర్వహిస్తుంటారు. ఈ తొమ్మిది రోజుల పండుగ.. ఆడవాళ్లకు, ముంగిళ్లకు సరికొత్త శోభ తెస్తుంది. అందమైన ముగ్గులతో ముంగిళ్లు మెరిసిపోతుంటే.. నూతన వస్త్రాలతో అమ్మాయిలు మురిసిపోతుంటారు. ఈ సమయంలో చేతులకు పెట్టుకునే గోరింటాకు.. మహిళల అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

చేతి పైభాగంలో డిజైన్..

Mehndi design on upper hand : రకరకాల మోహందీ డిజైన్లు మగువలను అలరిస్తుంటాయి. అందులో ఒకటి.. అరచేతి వెనుక భాగంలో వేసుకునే గోరింటాకు డిజైన్. చూడటానికి ఈ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. పండగ రోజుల్లో వేసుకుంటే.. ఇంకా అద్భుతంగా ఉంటుంది. కొత్త దుస్తుల్లో మెరిసిపోతూ మెహందీ బాగా కనిపిస్తుంది. గోరింటాకు పెట్టుకోవడం తెలిసినవారు ఎవరైనా.. దీన్ని సులభంగా వేసుకోవచ్చు.

మెహందీ ఆర్టిస్ట్​గా సాయిపల్లవి.. సమంత,అనుపమ కామెంట్

అరబిక్ మెహందీ డిజైన్..

Arabic mehndi design : నవరాత్రుల వేళ.. మీరు వేసుకోదగిన మరో అద్భుతమైన డిజైన్.. అరబిక్ మెహందీ డిజైన్. ఎవరైనా నచ్చి.. వేసుకుంటే ఈ డిజైన్ ఎంతో బాగుంటుంది. ఇది వేసుకోవడానికి.. కేవలం 10 నుంచి 15 నిమిషాల సమయం పడుతుంది. దీన్ని చేతికి రెండు వైపులా వేసుకోవచ్చు. ఈ మెహందీని మీ చేతి ముందు, ఇంకా వెనుక భాగంలో కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు వైపులా ఉండే ఈ రంగోలీ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది.

మెహందీ వేడుకలో మెరిసిన నితిన్, షాలిని

అమ్మవారి చిత్రంతో మెహందీ..

Mehndi design with Durga Mata image : సాధారణ మెహందీ డిజైన్లు కాకుండా.. నవరాత్రి ప్రత్యేకతను ప్రతిబింబించేలా కూడా డిజైన్లు వేసుకోవచ్చు. ఈ డిజైన్లలో మీ చేతులపై దుర్గా మాత అమ్మవారి చిత్రాన్ని వేసుకోవచ్చు. ఇది ఇతర మెహందీ డిజైన్ల నుంచి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇంకా.. చాలా అందంగా కూడా కనిపిస్తుంది. అయితే.. ఇలాంటి డిజైన్లను ఎవరికి వారు వేసుకోవడం అంత తేలికకాదు. దీన్ని రెగ్యులర్​గా మెహందీ పెట్టుకునేవారు వేసుకోలేరు. దీనికోసం.. ప్రత్యేకంగా మెహందీ డిజైన్స్​ వేసే నిపుణుల అవసరం ఉంటుంది.

నవరాత్రి పండగ వెలుగులు మీ ముఖంతోపాటు చేతులపైనా ప్రతిబింబించాలంటే.. ఈ మెహందీ చక్కటి ఆప్షన్​లా కనిపిస్తుంది. మరి, మేము తెచ్చిన మెహందీ డిజైన్స్ చూశారు కదా.. ఇంకా ఆలస్యం ఎందుకు..? వెంటనే మెహందీ అందుకోండి. చక్కటి డిజైన్లు మీ చేతులపై వేసుకోండి.

మెహందీ వేడుకల్లో కాజల్ అగర్వాల్

మెహందీ వేడుకలో గాయని సునీత.. ఫొటోస్ వైరల్

Last Updated : Oct 20, 2023, 11:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.