ETV Bharat / bharat

'ఆస్తి కోసం తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు'.. సిద్ధూపై సోదరి ఆరోపణలు

author img

By

Published : Jan 28, 2022, 3:28 PM IST

navjot-singh-sidhu
నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ, సుమన్​ తూర్​

Navjot Singh Sidhu sister: పంజాబ్​ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై ఆయన సోదరి సుమన్​ తూర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్తి కోసం తల్లిని, తనను ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. అమెరికా నుంచి చండీగఢ్​ వచ్చిన ఆమె విలేకరుల సమావేశంలో తన తల్లి పడిన కష్టాలను వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

Navjot Singh Sidhu sister: పంజాబ్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూపై ఆయన సోదరి సుమన్​ తూర్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు తన తల్లిని ఇంట్లోంచి గెంటేశారని ఆరోపించారు. కొద్ది రోజుల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న తరుణంలో సిద్ధూపై ఇలాంటి విమర్శలు రావటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

చండీగఢ్​లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. తన తల్లి పడిన కష్టాలను వివరించారు ప్రవాస భారతీయురాలు, అమెరికా పౌరసత్వం కలిగిన సుమన్​ తూర్​. తల్లి నిర్మల భగవత్ పడిన కష్టాన్ని వివరిస్తూ పలుమార్లు భావోద్వేగానికి లోనయ్యారు సుమన్​.

  • #WATCH | Chandigarh: Punjab Congress chief Navjot Singh Sidhu's sister from the US, Suman Toor alleges that he abandoned their old-aged mother after the death of their father in 1986 & she later died as a destitute woman at Delhi railway station in 1989.

    (Source: Suman Toor) pic.twitter.com/SveEP9YrsD

    — ANI (@ANI) January 28, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

" నవజ్యోత్​ సింగ్ చాలా కఠినాత్ముడు. ఓ విషాదకర ప్రమాదంలో మా అక్క, కుటుంబ సభ్యులు మరణిస్తే.. కనీసం సంతాపం తెలపలేదు. ఈ విషయంపై సమాధానం చెప్పాలని ప్రజలు, ముఖ్యంగా మహిళలు​ కోరాలి. 1986లో మా తండ్రి భగవత్​ సింగ్​ సిద్ధూ మృతి చెందిన తర్వాత మా కుటుంబానికి కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కుటుంబ ఆస్తిని దక్కించుకునేందుకు.. నన్ను, మా తల్లిని ఇంట్లోంచి గెంటేశాడు. మాపట్ల క్రూరంగా ప్రవర్తించాడు. ఇంటి నుంచి సమీపంలోని బస్టాండ్​కు నడుచుకుంటూ వెళ్లింది ఇంకా గుర్తుంది. 1989లో దిక్కులేనిదానిలా దిల్లీ రైల్వేస్టేషన్​లో మా తల్లి మరణించింది."

- సుమన్​ తూర్​, నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ సోదరి

తన తల్లి కోల్పోయిన గౌరవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకే భారత్​కు వచ్చినట్లు తెలిపారు సుమన్​. జనవరి 20న అమృత్​సర్​లోని సిద్ధూ ఇంటికి వెళ్లానని, కానీ, గేటు తీసేందుకు కూడా అంగీకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు​.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: అమ్మాయిలకు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్లు- కాంగ్రెస్​ బంపర్​ ఆఫర్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.