ETV Bharat / bharat

ఆ ట్వీట్​తో మరోసారి కాంగ్రెస్​ పరువు తీసేసిన సిద్ధూ!

author img

By

Published : Mar 17, 2022, 4:48 PM IST

Navjot Singh Sidhu: పంజాబ్​ కాంగ్రెస్​ సీనియర్​ నేత నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ చేసిన ఓ ట్వీట్​ కాంగ్రెస్​ను మరోమారు ఇబ్బందుల్లోకి నెట్టింది. పంజాబ్​లో మాఫియా వ్యతిరేక శకం ప్రారంభమైందంటూ ఆప్​ ప్రభుత్వాన్ని ప్రశంసించటం.. సొంత పార్టీపైనే పరోక్ష విమర్శలు చేసినట్లయింది.

Punjab Navjot Sidhu
నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ

Navjot Singh Sidhu: నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ.. సొంత పార్టీ నేతలపైనే నేరుగా విమర్శలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. పంజాబ్​ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్​ సింగ్​ కాంగ్రెస్​ను వీడేందుకు ముఖ్య కారణమయ్యారు. ఆ తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన చన్నీ లక్ష్యంగా విమర్శలు చేశారు. తాజాగా మరోమారు హస్తం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టారు సిద్ధూ. పంజాబ్​ నూతన ముఖ్యమంత్రి భగవంత్​ మాన్​కు శుభాకాంక్షలు తెలుపుతూ చేసిన ట్వీట్​ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆమ్​ ఆద్మీ పార్టీని ప్రశంసిస్తూ.. పంజాబ్​లో మాఫియా వ్యతిరేక శకం ప్రారంభమైందని పేర్కొన్నారు.

  • The happiest man is the one from whom no one expects … Bhagwant Mann unfurls a new anti - Mafia era in Punjab with a mountain of expectations …hope he rises to the occasion , brings back Punjab on the revival path with pro - people policies … best always

    — Navjot Singh Sidhu (@sherryontopp) March 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పంజాబ్​లో సరికొత్త మాఫియా వ్యతిరేక శకాన్ని భగవంత్​ మాన్​ ప్రారంభించారు. అంచనాలు అందుకుంటూ, ప్రజాప్రయోజన విధానాలతో పంజాబ్​ను తిరిగి గాడిన పెడతారనే నమ్మకం ఉంది. ఎల్లప్పుడు మంచే జరుగుతుంది."

- నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ, పంజాబ్​ కాంగ్రెస్​ మాజీ అధ్యక్షుడు.

పంజాబ్​ ప్రదేశ్​ కాంగ్రెస్​ కమిటీ అధ్యక్ష పదవికి సిద్ధూ.. రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన మరుసటి రోజునే ఈ మేరకు ట్వీట్​ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోర పరాభవం చవిచూసింది. ఎన్నికల ఫలితాల అనతరం ఓటమికి గల కారణాలపై సీడబ్ల్యూసీ సమావేశమై చర్చించింది.

ఇదీ చూడండి: పంజాబ్​ సీఎం సంచలన ప్రకటన.. చరిత్రలో ఎవరూ తీసుకోని నిర్ణయం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.