TSPSC Paper Leakage: ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో 'ఈడీ'కి చుక్కెదురు

author img

By

Published : May 10, 2023, 10:37 AM IST

Updated : May 10, 2023, 11:14 AM IST

tspsc

10:31 May 10

TSPSC Paper Leakage : పేపర్ లీకేజీ కేసులో ఈడీ వేసిన పిటిషన్ కొట్టివేత

TSPSC Paper Leakage Case Latest Update : టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో నాంపల్లి కోర్టులో ఈడీకి చుక్కెదురైంది. నిందితులను కస్టడీకి కోరుతూ ఎన్​ఫోర్స్​మెంట్​ అధికారులు వేసిన పిటిషన్​ను కోర్టు కొట్టేసింది. రేణుక, డాక్యా నాయక్, రాజేశ్వర్ నాయక్, గోపాల్ నాయక్, షమీమ్​లను ప్రశ్నించడానికి అనుమతి ఇవ్వాలని ఈడీ అధికారులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. చంచల్ గూడ జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న ఐదుగురు నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకుంటామని, దీనికి అనుమతించాలని ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు పిటిషన్​లో కోరారు.

ఈడీ అధికారులు వేసిన పిటిషన్​కు సిట్ అధికారులు కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న నాంపల్లి 12వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టు... ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హం కాదని పేర్కొంది. కస్టడీ పిటిషన్​పై ఈడీ అధికారులు ఎంఎస్జే కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను చంచల్​గూడ జైల్లో ప్రశ్నించారు. టీఎస్​పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనితారాంచంద్రన్​తో పాటు సహాయ కార్యదర్శి సత్యనారాయణ, కాన్ఫిడెన్షియల్ సెక్షన్ అధికారి శంకరలక్ష్మి వాంగ్మూలాలను నమోదు చేసుకున్నారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఈడీ అధికారులు మనీలాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 10, 2023, 11:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.