ETV Bharat / bharat

జాతీయ యుద్ధ స్మారకంపై 'గల్వాన్'​ వీరుల పేర్లు

author img

By

Published : Jan 20, 2021, 9:01 PM IST

Updated : Jan 20, 2021, 9:50 PM IST

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. గల్వాన్​ ఘటనలో వీరమరణం పొందిన సైనికులకు విశిష్ఠ గౌరవం ఇవ్వనుంది కేంద్రం. ఈ మేరకు వారి పేర్లను జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై చెక్కినట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Names of 20 'Galwan heroes' inscribed on national war memorial
జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై 'గల్వాన్'​ వీరుల పేర్లు

గల్వాన్​ ఘటనలో అమరులైన 20 మంది భారత జవాన్లకు విశిష్ఠ గుర్తింపు దక్కింది. గణతంత్ర దినోత్సవానికి ప్రదర్శించబోయే జాతీయ యుద్ధ స్మారక చిహ్నంపై వారి పేర్లను చెక్కినట్టు అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని వీరికి.. మరణాంతర సైన్య పురస్కారాలు అందించనుంది కేంద్రం. వీరిలో కొందరు శౌర్య పురస్కారం కూడా అందుకోనున్నారు.

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో గతేడాది జూన్​ 15న జరిగిన ఘటనలో వీరు ప్రాణాలు కోల్పోయారు. 16వ బిహార్​ రెజిమెంట్​ కమాండింగ్​ అధికారి కల్నల్​ బి. సంతోశ్​ బాబు ఈ భీకర పోరాటంలో ప్రాణాలర్పించిన వారిలో ఒకరు.

నాడు.. ఏం జరిగిందంటే.?

భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరిన తరుణంలో.. గల్వాన్​లోని పెట్రోలింగ్ పాయింట్-14 వద్ద అక్రమ కట్టడాలను వ్యతిరేకించిన భారత సైనికులపై చైనా దాడి చేసింది. రాళ్లు, ముళ్లకర్రలు, ఇనుప రాడ్లతో చైనా సైనికులు దాడి చేశారు. ఈ క్రమంలో 20 మంది భారత సైనికులు మృతిచెందారు. ఈ దాడుల్ని గత రెండు దశాబ్దాల చరిత్రలోనే అత్యంత తీవ్రమైనవిగా పేర్కొన్నారు అధికారులు. అయితే.. ఈ ఘటనలో చైనా సైనికులు ఎంతమంది మరణించారనేది తెలియరాలేదు. కానీ.. దాదాపు 35 మంది ప్రాణాలు కోల్పోయారని అమెరికన్​ ఇంటలిజెన్స్​ నివేదిక వెల్లడించింది.

ఇదీ చదవండి: ఆ పార్టీల మధ్య 'గోలీమార్​' రాజకీయం

Last Updated : Jan 20, 2021, 9:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.