ETV Bharat / bharat

దెయ్యం భయంతో ఆ ఊరు ఖాళీ!

author img

By

Published : Mar 30, 2021, 12:25 PM IST

మనిషి ఆలోచనలు అంతరిక్షాన్ని తాకుతున్నా.. అట్టడుగు భయాలు మాత్రం అలానే ఉన్నాయనడానికి ఒడిశాలోని ఆ గ్రామమే ఓ ఉదాహరణ. మనిషి ఆలోచనల్లో ఎక్కడో మిగిలి ఉన్న దెయ్యం అనే భయం ఆ గ్రామస్థులను వెంటాడగా.. పుట్టిపెరిగిన ఊరును ఒంటరిని చేసి పోతున్నారు. పట్టించుకునే వారు లేక ఏళ్లుగా నీడనిచ్చిన ఇళ్లు.. నిజంగానే దెయ్యాల కోటల్లా మారాయి.

Mysterious deaths in Nayagarh village; People leaving their homes in fear of being killed by ghost
దెయ్యం భయంతో.. ఖాళీ అయిన ఊరు

దెయ్యం భయంతో.. ఖాళీ అయిన ఊరు

జన సంచారం లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్న రోడ్లు.. వాటి పక్కన బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా మిగిలి పోయిన ఇళ్లు.. ఎవరైనా తిరిగొస్తారేమో అని ఆశగా ఎదురు చూసే వాకిళ్లు.. ఇవన్నీ దెయ్యం నేపథ్యంగా సాగే సినిమాల్లో కనిపించే సన్నివేశాలు. అయితే.. ఆ భావన, భయం అన్నీ రెండున్నర గంటలే. కానీ ఒడిశాలోని నయాగడ్‌ జిల్లా రాణాపూర్ బ్లాక్ పరిధి గుండురుబడి గ్రామానిది ఏడాదిగా ఇదే దుస్థితి. మరణం కన్నా మరణభయమే వారిని ఆ ఊరి ప్రజలను వెంటాడగా.. ఒక్కొక్కరుగా ఇళ్లు వాకిలి వదిలి గ్రామం వెలుపలకు చేరారు. దీనికి కారణం.. దెయ్యం భయం.ఆ భయానికి కారణం.. నాలుగేళ్లలో ఐదుగురు మగవాళ్లు ఏ కారణం లేకుండా చనిపోవడమే.

అందులోనూ ఇద్దరు కొత్తగా పెళ్లైన కురాళ్లు. వీరి చావుతో భయాందోళనకు గురైన గ్రామస్థులు.. తాంత్రికులను సంప్రదించగా ఊరొదిలితే కానీ ప్రాణాలు దక్కవంటూ.. ఆ తాంత్రికులు మరింతగా భయపెట్టారు. ఇక చేసేదేమీ లేక.. ఊరు వదిలి పోతున్నారు. ఊరు వదిలిపోలేని వాళ్లు సూర్యాస్తమయం అయ్యిందంటే దెయ్యం భయంతో గడప దాటి బయటకు రావడం లేదు.

''గత ఏడాది పెళ్లైన ఇద్దరు కుర్రాళ్లు ఏ కారణం లేకుండానే చనిపోయారు. దాంతో అందరూ భయపడిపోయారు. ఇక్కడ దెయ్యం ఉందన్న భయాందోళన.. అందరిలోనూ ఉంది. ఆ విషయాన్ని నలుగురు తాంత్రికుల దగ్గర చెబితే.. వాళ్లు ఊరి వదిలి పొమ్మన్నారు. వాళ్ల సలహాతో అందరూ దెయ్యం బారి నుంచి ప్రాణాలు దక్కించుకోవడానికి ఊరు వదిలి పోతున్నారు.''

-గుండురుబడి గ్రామస్థుడు, ఒడిశా

దెయ్యం కేవలం మగవాళ్లపైనే పగబట్టిందని గుండురుబడి గ్రామస్థులు బలంగా నమ్ముతున్నారు. మగవాళ్లు అందునా కొత్తగా పెళ్లైన వారి శరీరంలోకి ఆ దెయ్యం ప్రవేశించి.. వారిని చంపేస్తుందంటూ తాంత్రికులు చెప్పింది గ్రామస్థులు నమ్మతున్నారు. అందుకే ప్రాణాలను రక్షించుకునేందుకు ఊరొదిలి పోతున్నామని అంటున్నారు.

''చాలా భయంగా ఉంటోంది. ఇక్కడ మేము ఉండలేక పోతున్నాం. ఏం చేయలేక పోతున్నాం. ఊరొదిలి వెళ్లిపోతే కానీ ప్రాణాలకు రక్షణ ఉండదని అందరూ అనుకుంటున్నారు. అప్పుడే అందరికీ మంచి జరుగుతుందని భావనకు వచ్చాం.''

-గుండురుబడి గ్రామస్థుడు, ఒడిశా

దెయ్యం అనే మూఢ విశ్వాసంతో భయాందోళనలో బతుకుతోన్న గుండురుబడి గ్రామస్థుల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు కొన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి.

''ఊరిలో కొద్ది సంవత్సరాల వ్యవధిలో కొందరు మగవాళ్లు.. అందులోనూ కొత్తగా పెళ్లైన వాళ్లు కూడా చనిపోయారు. మగవాళ్లను దెయ్యమే చంపుతోందన్న భయాందోళన వారిలో ఉంది. భూత భయంతో వారు.. ప్రశాంతంగా ఉండలేక పోతున్నారు. ఈ రోజుల్లో ఇవన్నీ మూఢ విశ్వాసాలుగా తోస్తున్నప్పటికీ వారిలో మాత్రం ఆ భయం అలానే ఉండిపోయింది.''

-స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, ఒడిశా

గుండురుబడి ప్రజలు ఇంతగా భయం గుప్పిట్లో బతుకున్న విషయం అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదని ఆ గ్రామస్థులు అంటున్నారు. ఏళ్ల తరబడి పైసాపైసా పోగేసి కట్టుకున్న ఇళ్లను దెయ్యం భయంతో వదిలేసి వచ్చామని ఊరి చివరన తమకు ఉండేందుకు గూడు కల్పించాలని కోరుకుంటున్నారు.

ఇవీ చదవండి: మహిళ గర్భాశయంలో సూది వదిలేసిన వైద్యులు!

పెట్రోల్​ వాహనాలకు ప్రత్యామ్నాయం ఈ 'సోలార్ కార్'!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.