ETV Bharat / bharat

మెట్ల నుంచి 'పియానో' రాగాలు.. ఫిదా అవుతున్న ప్రయాణికులు

author img

By

Published : Dec 30, 2021, 8:41 PM IST

Musical staircase in metro: మెట్లు ఎక్కితే అలసటతో పాటు, బోరింగ్​గా ఫీలవుతారు చాలా మంది. అందుకే లిఫ్టులు, ఎస్కలేటర్ల వంటి వాటిని ఎక్కువగా ఆశ్రయిస్తారు. అయితే.. కేరళలోని ఓ మెట్రో స్టేషన్​లో ఉన్న మెట్లు ఎక్కుతున్న ప్రయాణికులు మాత్రం చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ మళ్లీ మెట్లే ఎక్కాలనుకుంటున్నారు. ఇందుకు కారణమేంటంటే..?

musical staircase in metro
మెట్ల నుంచి 'పియానో' రాగాలు

మెట్రో స్టేషన్​లో మెట్ల నుంచి వినిపిస్తున్న సంగీతం

Musical staircase in metro: మెట్లెక్కితే బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే విషయం మనందరికీ తెలుసు. అయినా సరే... మనలో చాలా మంది ఎలాంటి సమయంలోనైనా లిఫ్ట్, ఎస్కలేటర్లు వంటి వాటిని వినియోగించడానికే ప్రాధాన్యం ఇస్తారు. ఫలితంగా అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో.. ప్రజలను ఆరోగ్యం దిశగా నడిపించేందుకు కేరళలోని కొచ్చి మెట్రో రైల్ లిమిటెడ్(కేఎంఆర్​ఎల్​) అధికారులు వినూత్నంగా ఆలోచించి.. 'మ్యూజికల్ స్టెయిర్ కేస్' పరిష్కారాన్ని కనుగొన్నారు.

musical staircase in metro
మెట్లపై నడుస్తున్న యువతి
musical staircase in metro
మెట్లపై నడుస్తున్న సమయంలో వెలుగుతున్న లైట్లు, వినిపిస్తున్న సంగీతం

Music from stairs: ఎర్నాకుళంలోని ఎంజీ రోడ్ మెట్రో స్టేషన్​లో ఈ 'మ్యూజికల్ స్టెయిర్​కేస్​'ను అధికారులు ఏర్పాటు చేశారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే.. ఈ మెట్లపై అడుగు పెడితే చాలు అందంగా లైట్లు వెలుగుతాయి. పియానో, కీబోర్డు నుంచి వచ్చే సంగీత ధ్వనులూ వినిపిస్తాయి. 'ఆనందంతో ఆరోగ్యం' అనే సందేశాన్ని ఇచ్చేందుకు మెట్రో అధికారులు ఈ సంగీత మెట్లను తీర్చిదిద్దారు.

Kerala metro music: ఎంజీ రోడ్​ మెట్రో స్టేషన్​లోని ఈ ప్రత్యేకత గురించి తెలియని ప్రయాణికులు.. ఈ మెట్లపై అడుగుపెట్టగానే.. ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఆ తర్వాత ఇందులోని మ్యూజిక్ మ్యాజిక్ గురించి తెలుసుకుని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మెట్లపై నడిచేటప్పుడు ప్రయాణికులు మోముపై చిరునవ్వు కనిపిస్తోందని... అదే తమ ప్రాజెక్టుకు దక్కిన విజయానికి సంకేతం అని అధికారులు చెబుతున్నారు.

musical staircase in metro
మ్యూజికల్ స్టెయిర్​కేస్​పై యువకుడి నడక
musical staircase in metro
మెట్లు ఎక్కుతూ సంతోషంలో కుటుంబం
musical staircase in metro
మెట్లపై నడుస్తున్న ప్రయాణికులు

మెట్రో అధికారుల కృషిపై ప్రయాణికులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెట్లు ఎక్కుతున్నప్పుడు, దిగుతున్నప్పుడు సంగీత రాగాలు వినిపిస్తూ ఉండడం వల్ల తాము ఒత్తిడిని మర్చిపోతున్నామని చెబుతున్నారు. విదేశాల్లో ఉండే ఈ తరహా సౌకర్యాలు తమ ప్రాంతాల్లోనూ లభిస్తున్నందున వారు మురిసిపోతున్నారు.

"మెట్లపై అడుగుపెట్టినప్పుడు సంగీతం వినిపిస్తోంది. ఇది చాలా సూపర్​గా ఉంది. దీన్ని మేం చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మాకు మంచి ఎక్స్​పీరియన్స్​ ఇచ్చింది."

-ప్రయాణికురాలు.

"మెట్లపై అడుగుపెట్టగానే సంగీతం వినిపిస్తుండటం చాలా బాగుంది. ఇది మాకు ఓ మంచి అనుభూతి. విదేశాల్లో ఉండే ఈ తరహా ఏర్పాట్లు ఇక్కడ కూడా ఉండడం చాలా సంతోషంగా ఉంది."

-ప్రయాణికుడు.

ఎలా ఏర్పాటు చేశారంటే..?

ట్రయాక్సియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్​తో కలిసి కేఎంఆర్ఎల్​ ఈ మ్యూజికల్ స్టెయిర్​కేస్​ ప్రాజెక్టును చేపట్టింది. వినియోగదారుల నుంచి వస్తున్న ఈ సానుకూల స్పందనతో తాము ఇతర స్టేషన్లలో సైతం ఈ తరహా మెట్లను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ట్రయాక్సియా మేనేజింగ్ డైరెక్టర్ సనోజ్ సిమోన్ తెలిపారు. కేఎంఆర్​ఎల్​ సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనుసులో మొగ్గతొడిగిన ఆలోచనతో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందని పేర్కొన్నారు.

ఈ మ్యూజికల్ స్టెయిర్స్​ను వారం వ్యవధిలోనే తాము రూపొందించామని సైమన్ తెలిపారు. ఆ తర్వాత వాటికి పియానో, కీబోర్డు తరహాలో డిజైన్లను రూపొందించామని ఆయన వివరించారు.

ఇదీ చూడండి: 'అభిషేకం చేస్తుండగా కళ్లు తెరిచిన అయ్యప్ప విగ్రహం!'

ఇదీ చూడండి: ఆసుపత్రిలో ఫ్లోర్​ తుడిచిన డాక్టర్.. వీడియో వైరల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.