ETV Bharat / bharat

ముంద్రా పోర్ట్​ డ్రగ్స్​ కేసులో అఫ్గాన్​ వ్యక్తి అరెస్ట్

author img

By

Published : Dec 14, 2021, 9:59 PM IST

Mundra Port Drugs Case: ముంద్రాపోర్ట్​ డ్రగ్స్​ కేసులో ఎన్​ఐఏ మరో వ్యక్తిని అరెస్ట్ చేసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసింది ఎన్​ఐఏ.

drugs case mundra port
ముంద్రా పోర్ట్​

Mundra Port Drugs Case: గుజరాత్​లోని ముంద్రా పోర్ట్​ డ్రగ్స్​ కేసుకు సంబంధించి ఎన్​ఐఏ ఓ అఫ్గాన్​ వ్యక్తిని అరెస్ట్​ చేసింది. అఫ్గానిస్థాన్​ నుంచి భారత్​కు డ్రగ్స్​ సరఫరాలో అఫ్గానిస్థాన్​కు చెందిన ఆర్యాన్ఫర్​ కీలక పాత్ర వహించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితుడు ఆర్యాన్ఫర్.. దిల్లీలోని నెబ్​సరాయ్​ ప్రాంతంలో నివసిస్తున్నాడని తెలిపారు.

ఈ ఏడాది సెప్టెంబరులో గుజరాత్​లోని ముంద్రా పోర్ట్​లో 2,988.21 కిలోల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఈ కేసుకు సంబంధించి ఎన్​ఐఏ ఇప్పటివరకు ఏడుగురిని అరెస్ట్ చేసింది.

ఇదీ చూడండి : దేశంలో ఒమిక్రాన్​ 'పీక్​' ఎప్పుడు? భారత్​ సిద్ధమేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.