ETV Bharat / bharat

Mother In Law Written Exam With Daughter In Law : ఒకేసారి పరీక్ష రాసిన అత్తాకోడళ్లు.. ఇంట్లో పిల్లలను చూసి..

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 24, 2023, 8:52 PM IST

Updated : Sep 25, 2023, 8:06 AM IST

Mother In Law Written Exam With Daughter In Law
Mother In Law Written Exam With Daughter In Law

Mother In Law Written Exam With Daughter In Law : బిహార్​ నలందా జిల్లాలో వింత ఘటన జరిగింది. అత్తాకోడళ్లు ఒకేసారి పరీక్ష రాసి ఆశ్చర్యానికి గురి చేశారు.

ఒకేసారి పరీక్ష రాసిన అత్తాకోడళ్లు

Mother In Law Written Exam With Daughter In Law : అత్తాకోడళ్లు ఒకేసారి పరీక్షకు హాజరైన ఘటన బిహార్​లోని నలందాలో జరిగింది. ప్రభుత్వం నిర్వహించే అక్షరాస్యత పథకం 'అక్షర్ అంచల్ యోజన' కింద పెట్టిన పరీక్షకు ఇద్దరు హాజరయ్యారు. ఒకే కుటుంబానికి చెందిన రెండు తరాల వ్యక్తులు ఒకేసారి పరీక్ష రాసి ఆశ్చర్య పరిచారు. నలందా జిల్లాలోని 105 సెంటర్లలో మహిళలకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు నిర్వహించారు. ఇందులో 60 మంది మహిళలు కొత్తగా అక్షరాస్యులయ్యారు.

ఇదీ జరిగింది..
రాణాబగిహాలోని కోసుక్​ గ్రామానికి చెందిన పంబీ దేవి నిరక్షరాస్యురాలు. ఆమె కోడలు ఇంద్రాణి దేవి సైతం చదువుకోలేదు. ఇద్దరూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇంట్లోని మనవరాళ్లను చూసిన పంబీ దేవికి.. చదువుకోవాలనే కోరిక కలిగింది. దీంతో గ్రామంలోని అక్షర్ అంచల్ యోజన అధికారి మున్నా మాంఝీని కలసింది. మరోవైపు కోడలు ఇంద్రాణి సైతం నిరక్షరాస్యురాలు కావడం వల్ల ఆమె సైతం అత్తతో కలిసి చదువుకునేందుకు వెళ్లేది. ఈ క్రమంలోనే చదవడం నేర్చుకున్న అత్తాకోడళ్లు ఒకేసారి పరీక్ష రాశారు.

"నా మనవరాళ్లను చూసినప్పుడు నాకు చదవాలని, రాయాలనే కోరిక పుట్టింది. వెంటనే తరగతులుకు హాజరై చదవడం ప్రారంభించాను. ఇప్పుడు నా పేరు, నా భర్త పేరు రాయడం నేర్చుకున్నాను. నా మనవరాళ్లను కూడా చదివిస్తుంటాను. 55 ఏళ్ల తర్వాత పెన్ పట్టుకోవడం ఆనందంగా ఉంది."

--పంబీ దేవి, అత్త

మరోవైపు తియూరి గ్రామానికి చెందిన ముగ్గురు కోడళ్లు కూడా ఒకేసారి పరీక్షకు హాజరయ్యారు. సునైనా దేవి, రూబి దేవి, సునీతా దేవిలకు చిన్ననాటి నుంచి బడికి వెళ్లే అవకాశం రాలేదు. ఆ తర్వాత పెళ్లిలు కావడం వల్ల విద్యను పూర్తిగా మర్చిపోయారు. ఇతరులు చదవడాన్ని గమనించిన వీరు.. తాము కూడా చదువుకోవాలని అనుకున్నారు. వెంటనే ప్రభుత్వం చేపట్టిన అక్షర్​ అంచల్ యోజనలో చేరి చదవడం నేర్చుకున్నారు.

ఏంటీ అక్షర పథకం..?
బిహార్​లో నిరక్షరాస్యతను అధిగమించేందుకు 2009 సెప్టెంబరులో అప్పటి ప్రభుత్వం 15 నుంచి 45 ఏళ్ల వయసున్న మహిళలకు కనీస విద్యాబుద్ధులను నేర్పించాలనే ఉద్దేశంతో 'ముఖ్యమంత్రి అక్షర్​ అంచల్​ యోజన' పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ శిక్షణను 6 నెలల పాటు అందిస్తారు. ఇందులో వర్ణమాల, అంకెలు, కూడికలు, తీసివేతలు, ప్రభుత్వ పథకాలు, ఇంగ్లీష్​తో పాటు సంతకం పెట్టడం వంటి చిన్న చిన్న విషయాలను మహిళలకు నేర్పిస్తారు. ఆరు నెలల శిక్షణ అనంతరం వీరికి పరీక్షను కూడా నిర్వహిస్తారు అధికారులు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లను అందజేస్తుంది బిహార్​ విద్యాశాఖ. ప్రతి ఆరు నెలలకోసారి ఈ పరీక్షను నిర్వహిస్తారు.

స్ట్రెచర్​పై పడుకునే ఎగ్జామ్ రాసిన విద్యార్థి- ఏం డెడికేషన్ గురూ!

ఇంటి పని చేసుకుంటూనే చదువు.. నలుగురు కోడళ్లతో కలిసి పరీక్ష రాసిన అత్త

Last Updated :Sep 25, 2023, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.