ETV Bharat / bharat

ఆరేళ్ల బాలిక, ఆమె తల్లిపై గ్యాంగ్​రేప్.. కదులుతున్న కారులోనే.. ఆ తర్వాత రోడ్డుపై..

author img

By

Published : Jun 25, 2022, 9:38 PM IST

Mother Daughter gangraped: ఉత్తరాఖండ్​లో తల్లీకూతుళ్లపై దారుణం జరిగింది. లిఫ్ట్ అడిగితే కారులో ఎక్కించుకున్న కొంతమంది వ్యక్తులు.. ఓ మహిళ, ఆమె ఆరేళ్ల కూతురిపై అత్యాచారం చేశారు. అనంతరం రోడ్డుపై వదిలేసి పారిపోయారు.

mother daughter gangraped
mother daughter gangraped

Roorkee gangrape: ఉత్తరాఖండ్​లో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల బాలిక, ఆమె తల్లిపై గ్యాంగ్​రేప్ జరిగింది. కారులోనే వీరిపై అత్యాచారం చేశారు దుండగులు. శుక్రవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. పిరన్ కలియార్​కు చెందిన మహిళ తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి రూడ్కీకి వెళ్తున్నారు. దారిలో ఆమె ఓ కారును ఆపి లిఫ్ట్ అడిగారు. రూడ్కీలో దించేయాలని కోరగా.. నిందితులు ఎక్కించుకున్నారు. సోనూ అనే వ్యక్తి కారులో ఉన్నాడని.. అతడి స్నేహితులు కూడా లోపలే కూర్చున్నారని బాధిత మహిళ తెలిపారు. వీరంతా కలిసి దారిలో తనపై అత్యాచారానికి పాల్పడినట్లు వివరించారు. తన కూతురిపైనా అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు వెల్లడించారు.

నిందితులు కదులుతున్న కారులోనే అత్యాచారం చేసి.. అనంతరం రోడ్డుపై వదిలేసి పారిపోయారు. రక్తస్రావంతోనే తన కూతురిని వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్​కు వెళ్లింది మహిళ. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించిన పోలీసులు.. వైద్య పరీక్షలు జరిపించారు. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కారులో ఎంతమంది నిందితులు ఉన్నారనేది మహిళ చెప్పలేదు. సోనూ పేరు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం రాత్రంతా వెతికినట్లు పోలీసులు చెప్పారు. అయితే, వారి జాడ తెలియలేదని సమాచారం. ఆ మార్గంలో ఉన్న సీసీటీవీ ఫుటేజీలోనూ ఎలాంటి ఆధారాలు దొరకలేదని తెలుస్తోంది.

కాగా, బాలిక ఆరోగ్య పరిస్థితి ఆందోళకరంగా మారింది. ఆమెకు ఇప్పటికే రెండు సర్జరీలు నిర్వహించారు. శుక్రవారం రాత్రి ఓ శస్త్రచికిత్స చేసిన వైద్యులు.. శనివారం మరో సర్జరీ నిర్వహించారు. ప్రస్తుతం చిన్నారి కోలుకుంటోందని వైద్యులు తెలిపారు.
బాధిత మహిళ తన భర్త నుంచి విడిపోయి గతకొన్నేళ్లుగా కలియార్​లో నివసిస్తున్నారు. ఆమె భర్త ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​పుర్​లో ఉంటున్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.