ETV Bharat / bharat

Monitor Lizard Rape: దారుణం.. ఉడుముపై అత్యాచారం!

author img

By

Published : Apr 8, 2022, 5:32 PM IST

Monitor Lizard Rape
ఉడుముపై అత్యాచారం

Monitor Lizard Rape: ఉడుముపై అత్యాచారం చేసిన దారుణ ఘటన మహారాష్ట్రలోని కొల్హాపూర్​లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు.

Monitor Lizard Rape: మహారాష్ట్ర కొల్హాపూర్​లో అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. సతారాలోని సహ్యాద్రి టైగర్​ ప్రాజెక్ట్ పరిధిలో ఓ వ్యక్తి.. ఉడుముపై అత్యాచారం చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొబైల్​ ఫోన్​లో రికార్డయ్యాయి. కేసు నమోదు చేసిన అధికారులు.. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్​ చేశారు. కాగా నిందితుడిని మానసిక వైద్యుని వద్దకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Monitor Lizard Rape
బైక్​లను స్వాధీనం చేసుకున్న అధికారులు

ఇదీ జరిగింది: సహ్యాద్రి టైగర్ ప్రాజెక్ట్​ పరిధిలో పులులను లెక్కించేందుకు కెమెరాలను ఏర్పాటు చేశారు. అయితే, కొందరు వ్యక్తులు వేట తుపాకులతో సంచరిస్తున్నట్లు కనిపించింది. వీరి వద్ద నుంచి మొబైల్​ ఫోన్లు తీసుకుని పరిశీలిస్తుండగా.. ఉడుముపై అత్యాచారం బయటపడింది. విచారణ మొదలుపెట్టిన అటవీ అధికారులు.. ఏప్రిల్​ 1న అనుమానితుడిని గుర్తించారు. అతని వద్ద బైకులు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. అతడు లైసెన్స్​ లేని వేటగాడని తేలింది. దీంతో మొత్తం ముగ్గురిపై కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించారు.

Monitor Lizard Rape
ఉడుముపై అత్యాచారం
Monitor Lizard Rape
ఉడుముపై అత్యాచారం

ఇదీ చదవండి: Live Video: బావిలో పడ్డ చిరుత.. మంచం సాయంతో పైకి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.