ETV Bharat / bharat

సోదరుని కళ్ల ముందే బాలికపై సామూహిక అత్యాచారం

author img

By

Published : Jul 25, 2021, 2:26 AM IST

Updated : Jul 25, 2021, 3:49 AM IST

ఉత్తర్​ప్రదేశ్​లో పదిహేనేళ్ల బాలికను సామూహిక అత్యాచారం చేశారు నలుగురు వ్యక్తులు. ఆమె సోదరున్ని తుపాకీతో బెదిరించి అతని ముందే ఈ దారుణానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. ఈ దారుణాన్ని వీడియోలో చిత్రించారు.

Minor girl gangraped
గ్యాంగ్​రేప్​

ఉత్తర్​ప్రదేశ్​లోని ముజఫర్​పుర్​లో దారుణం జరిగింది. సోదరుని ముందే ఓ బాలికను నలుగురు వ్యక్తులు కలిసి అత్యాచారం చేశారు. అక్కడితో ఆగకుండా ఈ దారుణాన్ని వీడియోలో చిత్రించారు.

శుక్రవారం రాత్రి బాధితురాలి ఇంట్లోకి నిందితులు రాహిబ్​, సహిబ్​, ఆరిఫ్, మారుఫ్​ ప్రవేశించారు. బాలిక సోదరున్ని గన్​తో బెదిరించి అతని ముందే బాధితురాలిని అత్యాచారం చేశారు. ఎవరికీ చెప్పకూడదని బెదిరించడానికి ఈ దారుణాన్ని వీడియోలో చిత్రించారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఆ సమయంలో బాలిక తల్లిదండ్రులు ఇంటికి దూరంగా ఉన్నారు.

అపస్మారక స్థితిలో ఉన్న బాలికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. బాలిక సోదరుని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించారు.

ఇవీ చదవండి:కాలకృత్యాలకు వెళ్లిన బాలిక​పై హత్యాచారం!

నవ దంపతుల ఆత్మహత్య.. కరోనా భయమే కారణమా?

Last Updated :Jul 25, 2021, 3:49 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.