ETV Bharat / bharat

మైనర్​పై గ్యాంగ్​ రేప్.. బాధితురాలి ఆత్మహత్య

author img

By

Published : Apr 3, 2022, 3:48 PM IST

minor gang rape
మైనర్​పై సామూహిక అత్యాచారం

minor girl gangrape suicide: 17 ఏళ్ల మైనర్​పై అత్యాచారానికి పాల్పడ్డారు ముగ్గురు యువకులు. మనస్తాపంతో బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన హరియాణాలో ఆదివారం జరిగింది.

minor girl gangrape suicide: హరియాణాలో దారుణం జరిగింది. చరఖీ దాదరీ జిల్లాలో 17 ఏళ్ల మైనర్​పై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇంటి దగ్గరే ఉండి 12వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతోంది. ఇంటి దగ్గర బాలిక ఒంటరిగా ఉన్న విషయాన్ని పసిగట్టారు నిందితులు. ఆమెను అపహరించి.. నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు షెడ్యూల్డ్​ కులానికి చెందిన బాలిక.

మనస్తాపానికి గురైన బాధితురాలు ఆదివారం ఇంట్లోనే ఫ్యాన్​కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాధితురాలు, నిందితులు ఒకే గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. 21 ఏళ్ల ప్రధాన నిందితుడు ఆమె ఇంటి సమీపంలోనే నివాసం ఉంటున్నాడని వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. నిందితులపై పోక్సో చట్టం, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: మూడో పెళ్లి గొడవ.. బావను హత్య చేసిన బావమరిది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.