ETV Bharat / bharat

మత్తుమందు ఇచ్చి విద్యార్థినిపై గ్యాంగ్​రేప్​.. స్కూల్ అటెండర్, అతడి స్నేహితులు కలిసి..

author img

By

Published : Mar 24, 2023, 12:09 PM IST

Updated : Mar 24, 2023, 12:56 PM IST

minor gang rape in delhi
minor gang rape in delhi

దిల్లీలో దారుణం జరిగింది. పదేళ్ల బాలికకు మత్తుమందు ఇచ్చి గ్యాంగ్​రేప్​నకు పాల్పడ్డారు కామాంధులు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగతా వారి కోసం గాలిస్తున్నారు. ఈ ఘటపై దిల్లీ మహిళా కమిషన్​ తీవ్రంగా స్పందింది. దిల్లీ పోలీసులకు, మున్సిపల్​ కార్పొరేషన్​కు నోటీసులు జారీచేసింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.

దిల్లీలో అమానవీయ ఘటన జరిగింది. పదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు. బాధితురాలు చదువుతున్న పాఠశాల అటెండర్​, అతడి సహచరులతో కలసి ఈ దారుణానికి ఒడిగట్టాడు. అటెండర్​ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలిని లాల్ బహదూర్ శాస్త్రి ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి.. కౌన్సిలింగ్ ఇచ్చామని పోలీసులు వెల్లడించారు.

పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. బాధితురాలు.. దిల్లీలోని మున్సిపల్​ పాఠశాలలో 5వ తరగతి చదువుతోంది. అదే పాఠశాలలో గత పదేళ్లుగా అజయ్(54) అనే వ్యక్తి అటెండర్​గా పనిచేస్తున్నాడు. అయితే మార్చి 14న బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు అజయ్​. మత్తుమందు ఇచ్చి.. తన ముగ్గురు సహచరులతో కలిసి బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఆ రోజు నుంచి బాలిక పాఠశాలకు వెళ్లలేదు. వార్షిక పరీక్షలకు కూడా హాజరు కాలేదు. బాధితురాలు స్కూల్​కు రాకపోవడం గురించి.. ఆమె టీచర్​ ఆరా తీసింది. బాధితురాలి సోదరుడు.. బాలికకు ఆరోగ్యం బాగోలేదని టీచర్​కు తెలిపాడు. దీంతో బాలిక తల్లిని సంప్రదించింది ఉపాధ్యాయురాలు.

మొదట్లో.. బాలికకు విరేచనాలు అవ్వడం వల్ల కడుపునొప్పితో బాధపడుతోందని ఆమె తల్లి తెలిపింది. ఆ తర్వాత జరిగిన విషయం చెప్పింది. నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని టీచర్..​ బాలిక తల్లిదండ్రులకు సూచించింది. కానీ వారు పోలీసులకు, పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయడానికి ఇష్టపడలేదు. దీంతో, పాఠశాల ప్రిన్సిపాల్ జోనల్​ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. అటెండర్​ను నిందితుడిగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

ఈ విద్యార్థినిపై సామూహిక అత్యాచార ఘటనపై దిల్లీ మహిళా కమిషన్(డీసీడబ్ల్యూ)​ తీవ్రంగా స్పందించింది. దిల్లీ పోలీసులు, మున్సినపల్​ కార్పొరేషన్​కు నోటీసులు జారీచేశారు డీసీడబ్ల్యూ చీఫ్​ స్వాతి మలివాల్​. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు.​స్కూల్లో కూడా ఆడపిల్లకి భద్రత లేకపోతే ఎలా అని ఆమె ప్రశ్నించారు. కాగా, ఈ ఘటన గురించి సత్వరమే ఉన్నతాధికారులకు తెలియజేయనుందుకు పాఠశాల ప్రిన్సిపల్​, బాలిక క్లాస్​ టీచర్​కు దిల్లీ మున్సిపల్​ కార్పొరేషన్ షోకాజ్​ నోటీసులు జారీచేసింది.

నవజాత శిశువును అమ్మేసిన తల్లి..
ఝార్ఖండ్​లో హృదయవిదారక ఘటన జరిగింది. అప్పుడే పుట్టిన నవజాత శిశువును రూ.4.5 లక్షలకు అమ్మేసింది ఓ తల్లి. ఈ ఘటన ఛత్రా జిల్లాలో జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు 24 గంటల్లో కేసును ఛేదించారు. పసికందును అమ్మేసిన మహిళను ఆశా దేవిగా గుర్తించారు. ఆమెతో సహా 11 మందిన పోలీసులు అరెస్టు చేశారు. ఆశా దేవి వద్ద రూ.లక్ష సీజ్​ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రా, బొకరో ప్రాంతాలకుకు చెందిన ఇద్దరు మధ్యవర్తులతో.. చిన్నారి కోసం బడ్కాగాన్​ అనే గ్రామానికి చెందిన దంపతులు డీల్​ కుదుర్చుకున్నారు. బాలుడిని అప్పగించగానే మధ్యవర్తులకు రూ.4.5 లక్షలు ముట్టజెప్పారు ఆ దంపతులు. ఆ మధ్యవర్తులు.. చిన్నారి తల్లికి రూ.లక్ష ఇచ్చి.. మిగతా డబ్బులు వారు తీసుకున్నారు. సర్దార్​ ఆస్పత్రి సూపరింటెండెంట్​ డాక్టర్​ మనీశ్​ లాల్​ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఛత్రా పోలీసులు కేసు నమోదు చేశారు.

Last Updated :Mar 24, 2023, 12:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.