ETV Bharat / bharat

గుప్తనిధుల కోసం 9 ఏళ్ల చిన్నారి బలి.. అత్త, మామ అరెస్ట్​

author img

By

Published : Mar 15, 2022, 2:02 PM IST

Minor sacrificed: గుప్త నిధులొస్తాయనే మూడ విశ్వాసంతో సొంత మేనల్లుడినే దారుణంగా హత్య చేశాడు మామ. భార్యతో కలిసి ఈ క్రూర చర్యకు పాల్పడ్డాడు. బాలుడి శవంతో క్షుద్రపూజలు చేసేందేకు సిద్ధమవుతుండగా పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేశారు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్​ చిత్రకూట్​లో జరిగింది.

Minor boy sacrificed by kin for hidden treasure in UP's Chitrakoot
గుప్తనిధుల కోసం 9 ఏళ్ల చిన్నారి బలి.. అత్తామామ అరెస్ట్​

Superstitious belief: మూఢ విశ్వాసం ఓ అభం శుభం తెలియని చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. గుప్త నిధులొస్తాయనే దురాశతో సొంత మేనల్లుడిని భార్యతో కలిసి దారుణంగా హత్య చేశాడు మామ. 9 ఏళ్ల పసివాడి గొంతునులుమి, ఆపై దారుణంగా కొట్టి హత్య చేశాడు. ఈ అమానవీయ ఘటన ఉత్తర్​ప్రదేశ్ బాందా జిల్లా చిత్రకూట్​లోని కోత్వాలి పోలీస్​ స్టేషన్ పరిధిలో జరిగింది. తమ ఇంట్లో గుప్త నిధులు ఉన్నాయని, చిన్నారిని బలి ఇస్తేనే అవి దక్కుతాయని కల వచ్చిందని నిందితులు విచారణలో చెప్పడం పోలీసులను షాక్​కు గురి చేసింది.

Chitrakoot news

ఏం జరిగిందంటే?

మృతి చెందిన బాలుడికి నిందితులు భుల్లు వర్మ, ఊర్మిళ మామ, అత్త అవుతారు. ఇరువురి కుటుంబాల ఇళ్లు దగ్గరగానే ఉంటాయి. అందుకే బాలుడు తరచూ వాళ్ల ఇంటికి వెళ్లేవాడు. అయితే మార్చి 8న చిన్నారి కనిపించకుండా పోయాడు. దీంతో అతని తండ్రి రామ్​ప్రయాగ్ రాయ్​దాస్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాలుగు రోజులు వెతికినా ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఇంతలో రాఘవ్​పుర్​ స్థానికుల నుంచి పోలీసులకు ఫోన్​ వచ్చింది. నిందితుల ఇంటి నుంచి దుర్వాసన వస్తుందని తెలిసింది. రంగంలోకి దిగిన వారి ఇంట్లో ఉన్న ఓ కంటైనర్​లో చిన్నారి శవాన్ని గుర్తించారు. అతడి మృతదేహంలో క్షుద్రపూజలు చేసేందుకు సిద్ధవవుతుండగా నిందితులిద్దరినీ అరెస్టు చేశారు. బాలుడి శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. అయితే కేసును త్వరగా ఛేదించడంలో పోలీసులు విఫలమయ్యారని స్థానికుల నుంచి నిరనస వ్యక్తం అయింది.

Minor boy sacrificed by kin for hidden treasure in UP's Chitrakoot
గుప్తనిధుల కోసం 9 ఏళ్ల చిన్నారి బలి.. అత్తామామ అరెస్ట్​

Minor sacrificed for treasure

తమ ఇంట్లో గుప్తు నిధులు ఉన్నాయని దీపావళి పండగ సమయంలో తమకు ఓ కల వచ్చిందని, చిన్నారిని బలిస్తే అవి తిరిగివస్తాయని ఇలా చేశామని నిందితులు విచారణలో చెప్పినట్లు ఎస్పీ ధవాల్ జైశ్వాల్ వెల్లడించారు. అందుకే క్రూర చర్యకు పాల్పడ్డారని వివరించారు. ప్రజలు ఇలాంటి మూఢ విశ్వాసాలకు దూరంగా ఉండాలని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగినట్లు తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.

ఇదీ చదవండి: మాస్టార్​ను చెప్పుతో కొట్టిన మహిళా ప్రిన్సిపల్.. ఏమైందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.