ETV Bharat / bharat

PM Gift Auction: వేలానికి మోదీ స్వీకరించిన కానుకలు, మెమెంటోలు

author img

By

Published : Sep 17, 2021, 5:49 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ(PM Gift Auction) స్వీకరించిన కానుకలు, మెమెంటోల(PM Mementos) వేలం వేయనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 7 వరకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ తెలిపింది.

PM Modi
ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ(PM Gift Auction) స్వీకరించిన కానుకలు, మెమెంటోలకు ఈ-వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. ఆసక్తి గల వారు సెప్టెంబర్‌ 17 నుంచి అక్టోబర్‌ 7 వరకు పీఎం-మెమెంటోస్‌ డాట్‌ కామ్‌(PM Mementos) వెబ్‌సైట్‌లో వేలంలో(PM gift auction online website) పాల్గొనవచ్చు.

వేలం వేయనున్న వాటిలో ప్రధాని(PM Modi Gifts Auction) అందుకున్న కానుకలు సహా అయోధ్య రామ మందిరం, చార్‌ధామ్‌ నమూనా, ఇతర చిత్రాలు, పెయింటింగ్‌లు, అంగవస్త్రాలు ఉన్నాయి. ఒలింపిక్స్​, పారాలింపిక్స్ పతక విజేతలు అందించిన క్రీడావస్తువులూ ఉన్నట్లు సాంస్కృతిక శాఖ పేర్కొంది.

వేలం ద్వారా అందే సొమ్మును గంగానది శుద్ధి కోసం చేపట్టిన నమామి గంగే ప్రాజక్టుకు అందజేస్తారు.

2019లోను ఈ తరహా వేలం నిర్వహించారు. నేషనల్ గ్యాలరీ ఆఫ్​ మోడర్న్ ఆర్ట్ వద్ద రెండు రోజుల పాటు​ వేలం నిర్వహించారు. ఆ వేలంలో ఓ బిడ్డర్ అత్యధికంగా 1800 మెమెంటోలు కొనుగోలు చేశారు. అలాగే చేతితో చేసిన ఓ వుడెన్​ బైక్​ రూ. 5 లక్షలకు అమ్ముడైంది. అశోక్​ స్తంభ్​ ప్రతిరూపం రూ. 13 లక్షలకు అమ్ముడైంది. అయితే.. ఈ వేలం ద్వారా వచ్చిన సొమ్మునూ నవామి గంగే ప్రాజెక్టుకు ఇవ్వడం గమనార్హం.

వెబ్​సైట్​ వివరాలు..

http://pmmementos.gov.in

pmmementos.gov.in

ఇదీ చదవండి:Modi birthday: ప్రధాని బర్త్​డే.. వ్యాక్సినేషన్​లో ఆ రికార్డు కోసం..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.