ETV Bharat / bharat

యూపీలో ఎంఐఎం కొత్త జట్టు- గెలిపిస్తే ఇద్దరు సీఎంలు!

author img

By

Published : Jan 22, 2022, 7:21 PM IST

MIM alliance: ఉత్తర్​ప్రదేశ్​లో కొత్త కూటమి ఆవిర్భవించింది. ఎంఐఎం ఐదు పార్టీలతో కలిసి 'భాగీదారీ పరివర్తన్​ మోర్చా'ను ఏర్పాటు చేసింది. తమను గెలిపిస్తే ఐదు సంవత్సరాల కాలంలో ఓబీసీ నుంచి ఒకరు, దళితుల నుంచి ఒకరు ముఖ్యమంత్రులుగా ఉంటారని తెలిపింది.

MIM's alliance with five parties in Uttar Pradesh
యూపీలో కొత్త కూటమి- ఐదు పార్టీలతో ఎంఐఎం జట్టు

MIM alliance: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరిగనున్న ఉత్తర్​ప్రదేశ్​లో ఐదు పార్టీలతో కలిసి 'భాగీదారీ పరివర్తన్​ మోర్చా' కూటమిగా బరిలోకి దిగుతున్నట్లు ఎంఐఎం ప్రకటించింది. తమకు అవకాశం ఇస్తే ఐదేళ్ల కాలంలో ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని చెప్పింది. ఒకరు ఓబీసీ వర్గానికి చెందిన వారు మరొకరు దళిత వర్గానికి చెందిన వారికి సీఎం అవకాశం ఇస్తామంది. అలాగే ముగ్గురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, అందులో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన వారిని ఎంపిక చేస్తామని చెప్పింది. ఈమేరకు అసదుద్దీన్ ఒవైసీ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కూటమికి బాబు సింగ్ కుశ్వాహా నేతృత్వం వహిస్తారని ప్రకటించారు.

MIM's alliance with five parties in Uttar Pradesh
యూపీలో కొత్త కూటమి- ఐదు పార్టీలతో ఎంఐఎం జట్టు

తమ కూటమిని గెలిపిస్తే బాబు సింగ్ కశ్వాహాకు సీఎం బాధ్యతలు అప్పగిస్తామని కూడా ఒవైసీ తెలిపారు. ఐదు పార్టీల సీట్ల పంపకానికి సంబంధించి 95శాతం చర్చలు పూర్తయ్యాయని, త్వరలోనే జాబితాను విడుదల చేస్తామన్నారు.

UP assembly polls

MIM's alliance with five parties in Uttar Pradesh
యూపీలో కొత్త కూటమి- ఐదు పార్టీలతో ఎంఐఎం జట్టు

ఇప్పటివరకు యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా, ఎస్పీ మధ్యే పోటీ ఉంటుందని అందరూ భావిస్తున్నారని, ఇప్పుడు తమ కూటమికి భాజపాకు మధ్యే అసలు పోటీ అని వామన్ మేశ్రమ్ తెలిపారు. తమతో ఇంకా ఏ పార్టీ కలిసి వచ్చినా చేర్చుకునేందుకు సిద్ధమని స్పష్టం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: యూపీలో ముస్లింలు ఎటువైపు? యోగి '80-20' వ్యూహం ఫలించేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.