ETV Bharat / bharat

modi US visit 2021: అమెరికాలో మోదీ షెడ్యూల్​ ఇదే!

author img

By

Published : Sep 20, 2021, 10:06 AM IST

Modi US visit
మోదీ అమెరికా పర్యటన

తీరికలేని భేటీలతో ప్రధాని మోదీ అమెరికా(modi us visit 2021) పర్యటన సాగనుంది. ఇందుకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన బయటకు రానప్పటికీ.. అగ్రరాజ్యంలోని దిగ్గజ వ్యాపారవేత్తలు, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​తో పాటు అనేకమంది ఉన్నతాధికారులను మోదీ కలవనున్నట్టు తెలుస్తోంది(modi us visit).

ఈ వారం అమెరికాకు వెళ్లనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వరుస భేటీలతో బిజీబిజీగా గడపనున్నారు(modi us visit). అగ్రరాజ్య ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్​, దిగ్గజ యాపిల్​ సంస్థ సీఈఓ టిమ్​ కుక్​తో పాటు అనేక మంది ఉన్నతస్థాయి అధికారులతో సమావేశం కానున్నట్టు తెలుస్తోంది(modi us visit 2021).

ఈ నెల 22న వాషింగ్టన్​కు చేరుకోనున్నారు మోదీ(modi america news). ఆ తర్వాతి రోజు.. అమెరికాలోని సీఈఓలతో సమావేశం కానున్నారు. వీరిలో యాపిల్​ సీఈఓ టిమ్​ కుక్​ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మోదీ షెడ్యూల్​ బయటకు వస్తే దీనిపై మరింత స్పష్టత వస్తుంది.

ఆ తర్వాత.. కమలా హ్యారిస్​తో మోదీ భేటీ అయ్యే అవకాశముంది. ఓ భారత సంతతి మహిళ అమెరికా ఉపాధ్యక్షురాలి హోదాకు వెళ్లడం ఇదే తొలిసారి. ప్రస్తుతానికి వీరి భేటీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు.

అదే రోజున.. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్​ మారిసన్​, జపాన్​ ప్రధాని యషిహిదే సుగాతో భేటీ అవుతారు మోదీ. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​- నరేంద్ర మోదీ మధ్య అత్యంత కీలకమైన ద్వైపాక్షిక భేటీ జరగనుంది.

క్వాడ్​ సదస్సు..

ఈ నెల​ 24న వాషింగ్టన్​లో జరిగే క్వాడ్​ సమావేశానికి మోదీ హాజరవుతారు(modi quad summit). క్వాడ్‌ దేశాధినేతలు ముఖాముఖిగా సదస్సులో పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్‌ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆ భేటీలోనే క్వాడ్‌ వ్యాక్సిన్‌ ఇనిషియేటివ్‌కు శ్రీకారం చుట్టగా.. భారత్‌ కూడా పలు దేశాలకు టీకాలను ఎగుమతి చేసింది. అయితే ఆ తర్వాత మన దేశంలో రెండో దశ రావడం వల్ల ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

కొవిడ్‌ ప్రధాన ఎజెండాగా క్వాడ్‌ సదస్సు జరగనుంది. క్వాడ్‌ వ్యాక్సిన్‌ ఇనిషియేటివ్‌పై సమీక్ష నిర్వహించడం సహా సైబర్‌ భద్రత, సముద్ర జలాల భద్రత, మానవతా సహకారం, వాతావరణ మార్పులు, విద్య, సాంకేతికత తదితర అంశాలపై క్వాడ్‌ నేతలు చర్చించనున్నారు. ఇక అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యంతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, తాలిబన్ల పాలనతో ఎదురయ్యే సవాళ్లను చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

మోదీ వాషింగ్టన్​లో ఉండే సమయానికే.. బ్రిటన్​ ప్రధాని బోరిస్​ జాన్సన్​ కూడా అక్కడ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో వారిరువురి మధ్య సమావేశం జరిగే అవకాశమున్నట్టు వార్తలు వస్తున్నాయి.

24సాయంత్రం వాషింగ్టన్​ నుంచి న్యూయర్క్​ వెళతారు ప్రధాని. ఐరాస జనరల్​ అసెంబ్లీలో కీలక ప్రశంగం చేయనున్నారు(modi un speech 2021).

రెండో ప్రయాణం...

కొవిడ్​ అనంతర కాలంలో మోదీ.. విదేశీ పర్యటన చేపట్టడం ఇది రెండోసారి. ఈ ఏడాది మార్చిలో బంగ్లాదేశ్​కు వెళ్లారు మోదీ. అమెరికాలో చివరిసారిగా.. 2019లో పర్యటించారు మోదీ(modi tour to usa). మాజీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఏర్పాటు చేసిన 'హౌడీ మోదీ' కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:- PM Modi: 'కార్యదర్శుల్లా కాదు.. నాయకుల్లా వ్యవహరించండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.