ETV Bharat / bharat

'కనిపించని శత్రువుతో పోరాడిన వాళ్లే సూపర్​ మ్యాన్​లు'

author img

By

Published : Dec 23, 2020, 6:10 AM IST

కొవిడ్​ మహమ్మారి వ్యాప్తి సమయంలో విశేష సేవలందించిన వైద్యులు, సంబంధిత సిబ్బందిని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ప్రశంసించారు. వారికి ప్రపంచం రుణపడి ఉందని తెలిపారు. కంటికి కనపడని శత్రువుతో యుద్ధం చేశారని పేర్కొన్నారు.

medical-fraternity-at-forefront-of-covid-crisis-not-less-than-superman-rajnath-singh
కంటికి కనపడని శత్రువుతో పోరాడారు.. వాళ్లే సూపర్​ మ్యాన్​లు..

కరోనా మహమ్మారి విజృంభించిన వేళ వైద్యులు ఎదురొడ్డి నిలిచారని.. వైరస్​ను లెక్కచేయకుండా ప్రపంచాన్ని రక్షించిన వాళ్లే 'సూపర్​ మ్యాన్​'లని రక్షణ​ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ కొనియాడారు. రష్యాలో తయారైన స్పుత్నిక్​ వీ వ్యాక్సిన్​ త్వరలోనే దేశానికి రానున్నట్లు తెలిపారు.

''వైరస్​ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొన్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది.. సూపర్​ మ్యాన్​లు. ఈ విషయం ప్రపంచానికి అర్థమైంది. సాయుధ బలగాల్లోనూ తమ విశేషమైన సేవలు అందించాలని రక్షణ మంత్రిగా కోరుతున్నా. వారికి దేశం మొత్తం రుణపడి ఉంది.''

- రాజ్​నాథ్​ సింగ్, రక్షణ మంత్రి

ఈ మేరకు కింగ్​ జార్జ్స్ మెడికల్​ కాలేజీ ప్రారంభ దినోత్సవంలో రాజ్​నాథ్​ సింగ్​ మాట్లాడారు. దేశంలోని వైద్య రంగంలో కేజీఎంయూ మంచి స్థానంలో ఉందని మంత్రి అభినందించారు. మరో వందేళ్ల పాటు కోట్ల మంది రోగులకు చికిత్స అందించాలని ఆశించారు.

యుద్ధం కొనసాగుతూనే ఉంది..

"యుద్ధం అనగానే.. తుపాకులు చేతపట్టిన సైనికులు మన మదిలోకి వస్తారు. కానీ, కరోనాతో పోరు విషయంలో డాక్టర్లు, వైద్య సిబ్బంది కంటికి కనిపించని శత్రువుతో పోరాడారు. వారి కష్టాన్ని మాటల్లో చెప్పలేను. నిరంతరాయంగా, శ్రమకు ఓర్చి కష్టపడ్డారు. ఒక పరిధిలోపల పోరాడారు. గత నాలుగు తరాలు ఇలాంటిది చూడలేదు"

- రాజ్​నాథ్, రక్షణ మంత్రి

కొవిడ్​పై యుద్ధం ఇంకా ముగియలేదు అని రాజ్​నాథ్​ పేర్కొన్నారు. బ్రిటన్​లో కొత్త తరహా కేసులు వెలుగు చూస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా సమర్థమైన వ్యాక్సిన్​ వచ్చే వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుందన్నారు. భారత్​ అందరికీ ఉపయోగపడేలా టీకా తయారు చేస్తోందని.. వ్యాక్సిన్​ పంపిణీ ప్రారంభం కాగానే డాక్టర్లు, పారామెడికల్​ సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు టీకా అందిస్తామని ఆయన వెల్లడించారు.

ఇదీ చదవండి: 'గగన పోరాటాల్లోనే కాదు.. మానవతా సేవలోనూ భేష్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.