ETV Bharat / bharat

బోల్తా పడిన వాహనం- కోళ్ల కోసం ఎగబడిన జనం

author img

By

Published : Jan 29, 2021, 2:28 PM IST

ఛత్తీస్​గడ్​లోని బేమెతరా రహదారిపై కోళ్ల లోడ్​తో వెళ్తోన్న వాహనం బోల్తా పడింది. సమాచారం అందుకున్న సమీప గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని కోళ్ల కోసం ఎగబడ్డారు.

chickens overturned
బోల్తా పడిన వాహనం- కోళ్ల కోసం ఎగబడ్డ జనం

ఒకరికి జరిగిన నష్టం మరొకరికి లాభం చేకూరుస్తుందని అంటారు. ఇలాంటి సంఘటనే ఛత్తీస్​గఢ్​లో జరిగింది. కోళ్లతో వెళ్తున్న ఓ వాహనం బోల్తాపడగా.. వాటిని తీసుకెళ్లేందుకు జనం ఎగబడ్డారు. ఛత్తీస్​గఢ్​లోని బేమెతరా- నవాగఢ్​ రహదారిపై ఈ సంఘటన జరిగింది.

వాహనం బోల్తా- కోళ్ల కోసం ఎగబడ్డం జనం

బేమెతరా నుంచి నవాగఢ్​కు కోళ్లతో వెళ్తున్న ​ఓ ట్రక్కు.. అట్​రియా గ్రామసరిహద్దులో అదుపు తప్పి బోల్తా పడింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు.. చిన్నాపెద్దా తేడాలేకుండా కోళ్లకోసం ఎగబడ్డారు. దొరికిన వారు దొరికినట్టుగా కోళ్లను తీసుకుని ఇళ్లకు వెళ్లారు.

అయితే.. బర్డ్​ ఫ్లూ ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ చికెన్​ తిన్నవారు కాస్తా ఇప్పుడు ఆందోళనకు లోనవుతున్నారు. ఇప్పటికైతే.. బేమెతరా జిల్లాలో ఒక్క బర్డ్​ ఫ్లూ కేసు కూడా నమోదు కాలేదని అధికారులు తెలిపారు. ఈ వాహన బోల్తా ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని తెలుస్తోంది.

ఇదీ చదవండి:తవ్వకాల్లో బయటపడిన పురాతన ఆలయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.