ETV Bharat / bharat

లెహంగా నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన వధువు.. పోలీస్ స్టేషన్​లో హైడ్రామా

author img

By

Published : Nov 9, 2022, 1:06 PM IST

పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్లు సెలెక్ట్​ చేసిన దుస్తులు నచ్చలేదని ఓ యువతి ఏకంగా పెళ్లినే రద్దు చేసింది. ఫలితంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలవ్వగా పోలీసులు జోక్యంతో ఆఖరికి శాంతి చర్చలు జరిగాయి.

marraige broke in uttarakhand due to lehanga
marraige broke in uttarakhand due to lehanga

పెళ్లి బట్టలు నచ్చలేదని వివాహాన్నే రద్దు చేసింది ఓ యువతి. తనకు ఆ లెహంగా నచ్చలేదని తల్లి చెప్పిన మాటలు విన్న వధువు.. పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన ఘటన ఉత్తరాఖండ్​లోని హల్ద్వానీలో జరిగింది. ఈ విషయమై ఇరువర్గాల మధ్యలో ఘర్షణ తలెత్తగా పోలీసులు జోక్యం చేసుకుని గొడవను సద్దుమణిగేలా చేశారు.

హల్ద్వానీలో నివాసముంటున్న ఓ యువతికి, అల్మోరాలో నివాసముంటున్న ఓ యువకుడికి వివాహం నిశ్చయమైంది. నవంబర్​ 5న పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. పెళ్లి పనుల్లో భాగంగా యువకుడి తరఫువాళ్లు పెళ్లి కార్డులు సైతం అచ్చు వేయించారు. అయితే ఇంతలోనే ఇరు వర్గాలకు ఓ విషయమై వాగ్వాదం మొదలైంది. పెళ్లి కూతురి కోసం వరుడి తండ్రి లఖ్​నవూ నుంచి ఓ ఖరీదైన లెహంగాను ఆర్డర్​ చేశారు. పెళ్లికి ముందు ఆమెకు అందించారు. అయితే ఆ లెహంగాను చూసిన యువతి తనకు నచ్చలేదని తేల్చి చెప్పింది. ఇదే మాట తన తల్లి సైతం చెప్పడం వల్ల ఈ మాట అబ్బాయి ఇంట్లో తెలిసింది. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఇక ససేమిరా ఈ పెళ్లి జరిగేది లేదంటూ ఇరు వర్గాలు ఓ ఒప్పందానికి వచ్చాయి. అలా అక్టోబర్​30న యువకుడి బంధువులు యువతి ఇంటికి చేరుకుని లక్ష రూపాయల నగదు ఇచ్చి వివాహ రద్దు ఒప్పందానికి వచ్చారు. డబ్బులు ఇచ్చిన్నట్లు రుజువుగా ఓ వీడియోను సైతం తీసుకున్నారు.

ఒప్పందంతో ఈ విషయం ఓ కొలిక్కి వచ్చింది అనుకునేలోపే సీన్​ రివర్స్​ అయ్యింది. ఏ ఇంటి వారు పెళ్లి వద్దనుకున్నారో.. వారే మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకుని యువకుడి ఇంటికి చేరుకున్నారు. దీంతో మరోసారి వాగ్వాదం జరిగింది. ఈ విషయం ఇక తేలదని పోలీస్​ స్టేషన్​ను ఆశ్రయించాయి ఇరువర్గాలు. అక్కడకు వెళ్లి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ప్రారంభించారు. ఆఖరికి పోలీసులు సర్దిచెప్పగా ఇక పెళ్లి రద్దు చేసుకుంటున్నట్లు నిర్ణయించుకున్నారు.

ఇదీ చదవండి:మంచుకొండల్లో అధికారం చేపట్టాలంటే.. కాంగ్రాపై గురి పెట్టాల్సిందే..!

పుట్టినరోజున అడ్వాణీకి శుభాకాంక్షల వెల్లువ.. స్వయంగా ఇంటికి వెళ్లిన మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.