ETV Bharat / bharat

యూనివర్సిటీల ఛాన్సలర్​గా మమత.. గవర్నర్ అధికారాలు కట్

author img

By

Published : Jun 6, 2022, 4:05 PM IST

Mamata Banerjee news: బంగాల్​లో కీలక పరిణామం జరిగింది. విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్​గా వ్యవహరిస్తున్న గవర్నర్ స్థానంలో.. ముఖ్యమంత్రిని ఛాన్సలర్​ను చేసేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.

CM Mamata Banerjee
మమతా బెనర్జీ

బంగాల్​లో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా చేసే ప్రతిపాదనకు రాష్ట్ర కేబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. ఇక నుంచి రాష్ట్ర గవర్నర్ జగ్​దీప్​ ధన్​కర్​​ స్థానంలో ముఖ్యమంత్రి మమతా ఛాన్సలర్​గా వ్యవహరించనున్నారు. ఈ నిర్ణయంతో గవర్నర్ అధికారాల్లో కోత పడనుంది. గత కొన్ని రోజులుగా గవర్నర్​ జగ్​దీప్ ధన్​కర్​కు, సీఎం మమతకు మధ్య వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఇటీవలే మమత సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు బిల్లుకు కేబినెట్ ఆమోదంతో మరో అడుగు ముందుకేసింది.

ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ఆహ్వానితుల జాబితా నుంచి గవర్నర్‌ను తొలగించి.. ఆ స్థానంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రిని చేర్చాలన్న మరో ప్రతిపాదనకూ బంగాల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. వ్యవసాయ, ఆరోగ్య వర్సిటీలతో సహా.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని నడుస్తున్న అన్ని విశ్వవిద్యాలయాలకు ముఖ్యమంత్రిని ఛాన్సలర్‌గా చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి వెల్లడించారు. జూన్ 10న ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల్లో ఈ ప్రతిపాదనలను అసెంబ్లీలో బిల్లుగా ప్రవేశపెట్టనున్నారు.

ఇదీ చదవండి: 'మీలా మతోన్మాదులకు స్మారకాలు కట్టట్లేదు'... పాక్​పై భారత్ ఫైర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.