ETV Bharat / bharat

మహారాష్ట్ర బాలుడికి రూ. 16కోట్ల విలువైన సాయం!

author img

By

Published : Aug 3, 2021, 8:55 AM IST

injection, us firm
ఇంజెక్షన్, అమెరికా సంస్థ

అమెరికాకు చెందిన ఓ సంస్థ భారీ చేయం చేసింది. అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహారాష్ట్ర బాలుడికి రూ. కోట్ల విలువ చేసే టీకాను ఉచితంగా అందించింది.

జన్యుపరమైన లోపంతో బాధపడుతున్న మహారాష్ట్రకు​ చెందిన ఓ బాలుడికి సాయం చేసేందుకు అమెరికా సంస్థ ముందుకొచ్చింది. కోట్ల రూపాయలు విలువ చేసే టీకా ఉచితంగా అందించింది.

ఇదీ జరిగింది..

మహారాష్ట్ర నాసిక్​కు చెందిన శివ్​రాజ్​ దవారే అనే బాలుడికి జన్యుపరమైన లోపం ఉంది. స్పైనల్ మస్కులర్ అట్రోపి(ఎస్​ఎమ్​ఏ)తో బాధపడుతున్న ఈ బాలుడికి సాయం చేసేందుకు ఓ అమెరికా సంస్థ ముందుకొచ్చింది.

శివ్​రాజ్​ తండ్రి విశాల్ దవారే ఓ జిరాక్స్​ సెంటర్ నడిపిస్తుంటారు. అయితే.. తమ పుత్రుడిలో ఈ జన్యుపరమైన లోపం ఉందని తెలియగానే వారు తీవ్రంగా బాధపడ్డారు. ఈ వ్యాధిని నయం చేయాలంటే.. జోల్​జెన్​స్మా(జీన్ రిప్లేస్​మెంట్​ థెరపీ) అనే ఇంజిక్షన్​ ఇవ్వాలని, దాని విలువ కోట్ల రూపాయలు ఉంటుందని ముంబయి హిందూజా ఆసుపత్రికి చెందిన న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రజేశ్ ఉదాని తెలిపారు.

శివ్​రాజ్​ తల్లిదండ్రులు ఇంత మొత్తం చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారు. దీంతో వారికి ఓ సూచన చేశారు డాక్టర్ బ్రజేశ్. అమెరికా సంస్థ క్లినికల్​ ట్రయల్స్​ జరిపేలా లాటరీకి నమోదు చేసుకోవాలని చెప్పారు. ఈ నేపథ్యంలో 2020 డిసెంబర్ 25న లాటరీకి దరఖాస్తు చేశారు శివ్​రాజ్​ తల్లిదండ్రులు. 2021 జనవరి 19న హిందూజా ఆసుపత్రిలో శివ్​రాజ్​కు రూ. 16కోట్ల విలుల చేసే ఇంజక్షన్​ ఇచ్చేందుకు అమెరికా సంస్థ అంగీకరించింది.

ఇటీవలే ఎస్​ఎమ్​ఏ టైప్​ 1 వ్యాధితో బాధపడుతున్న వేదిక శిండే(1) కోసం కూడా లాటరీ అప్లై చేశారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. కానీ, ఇంజిక్షన్ తీసుకున్న రెండు నెలల తర్వాత ఆ చిన్నారి మరణించింది.

ఇదీ చదవండి:ప్రేమికులుగా దూరమైనా.. మరణంలో ఒక్కటై!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.