ETV Bharat / bharat

అనాథ బాలికపై ఏడాదిగా గ్యాంగ్​రేప్​- పోలీసుల మానవత్వంతో...

author img

By

Published : Aug 28, 2021, 4:00 PM IST

orphan girl gang rape
గ్యాంగ్​రేప్

ఎవరూ లేని అనాథ బాలికపై కోరలు చాచాయి కామపిశాచులు. దిక్కులేక రైల్వే స్టేషన్​లో తిరుగుతున్న అమ్మాయిపై సామూహిక అత్యాచారానికి(gangrape latest news) పాల్పడ్డారు ముగ్గురు కీచకులు. ఏడాదిగా లైంగిక వేధింపులకు పాల్పడిన మానవ మృగాలను మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు.

మహారాష్ట్ర పాల్​గఢ్​ జిల్లాలో దారుణం జరిగింది. వసయి ప్రాంతంలో 17ఏళ్ల అనాథ బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి (gangrape latest news) పాల్పడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేశారు. వారంతా గతేడాది నవంబర్​ నుంచి ఈ ఏడాది ఆగస్టు వరకు అనేక సార్లు ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ అధికారి తెలిపారు.

"బాలిక కుటుంబాన్ని ఆమె తల్లి వదిలేసి వెళ్లింది. అప్పటి నుంచి తండ్రితో కలిసి ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. 2020 నవంబర్​లో ఆమె తండ్రి చనిపోయారు. దీంతో యజమాని ఇళ్లు వదిలిపొమ్మన్నగా, బాలిక రోడ్డునపడింది. వసయిలోని ఫుట్​పాత్​లపైనే నివసిస్తోంది" అని ఓ రైల్వే డీసీపీ ప్రదీప్ చవాన్ తెలిపారు.

అత్యాచారం గురించి ఎలా తెలిసింది?

ఈ క్రమంలో వసయి స్టేషన్​ ప్రాంతంలో తిరుగుతున్న బాలికను ఆగస్టు 3న కొందరు పోలీసులు గుర్తించారు. ఆమె వివరాలు ఆరా తీశారు. తెలియని బాధలో, భయంతో ఉన్న బాలిక వారికి ఏమీ చెప్పలేకపోయింది. ఆమెతో మాట్లాడటానికి టాటా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సోషల్ సైన్సెస్ సహా పలు ఎన్​జీఓల సహకారం తీసుకున్నారు పోలీసులు.

"బాలికను వైద్య పరీక్షలకు పంపించాం. అప్పుడు ఆమె లైంగిక దాడికి గురైందని తేలింది." అని డీసీపీ చవాన్ తెలిపారు.

ఒక్క పేరుతో దర్యాప్తు..

అయితే.. నిందితుల్లో అజయ్ అనే ఓ పేరును మాత్రం బాలిక చెప్పగలిగింది. దాని ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

కొంతకాలానికి తేరుకున్న బాలిక తన వివరాలను పోలీసులకు ఇచ్చింది. బాలిక ఇచ్చిన సమాచారం మేరకు బృందాలుగా ఏర్పడిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించారు. ఎట్టకేలకు ఆగస్టు 10న ప్రధాన నిందితుడు అజయ్​ కుమార్​ను అదుపులోకి తీసుకున్నారు. అతడు నేరాన్ని అంగీకరించి, సహచరుల పేర్లనూ వెల్లడించాడు. దీంతో వారినీ శుక్రవారం అరెస్టు చేశారు పోలీసులు.

బాలికకు చికిత్స..

నిందితులపై పలు ఐపీసీ సెక్షన్లు సహా పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. బాలిక పూర్తిగా కోలుకోవడానికి వైద్యుల సహకారం తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఆమెకు పునరావాసం కల్పించి, వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తామని చెప్పారు.

వెలుగులోకి వరుస అత్యాచార ఘటనలు..

మహారాష్ట్ర సహా కర్ణాటకలోనూ వరుస అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. మైసూర్​లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుకుంటున్న ఉత్తర్​ప్రదేశ్​కు చెందిన విద్యార్థిపై ఇటీవలే గ్యాంగ్​రేప్​ జరిగింది. తన బాయ్​ఫ్రెండ్​తో కలిసి చాముండి హిల్స్ ప్రాంతానికి వెళ్లి బైక్​పై తిరిగి వస్తుండగా.. కొందరు యువకులు వారిని అడ్డగించారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారి వద్ద పెద్దగా నగదు లేకపోవడం వల్ల.. దుండగులు దాడి చేశారు. యువతి బాయ్​ఫ్రెండ్​ను చితకబాదారు. లలితాద్రిపుర రహదారి వద్ద యువతిపై అత్యాచారానికి ఒడిగట్టారని తెలిసింది.

బెళగావిలోనూ ఓ 15ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు కీచకులు.

ఇదీ చూడండి: Mysuru gang rape case: ఐదుగురు నిందితులు అరెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.