ETV Bharat / bharat

కరెంట్​ కోతలకు రోగి బలి.. ఇంట్లో వెంటిలేటర్​ పనిచేయక!

author img

By

Published : Jun 3, 2022, 1:06 PM IST

Patient Dead: కరెంట్​ కోతలకు ఓ రోగి బలయ్యాడు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న బాధితుడు.. తన ఇంట్లోనే వెంటిలేటర్​పై ఉన్నాడు. విద్యుత్ అంతరాయం కలగడం వల్ల వెంటిలేటర్​ పనిచేయక గురువారం మరణించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

Patient Dead
Patient Dead

Patient Dead Due To PowerCut: మహారాష్ట్రలోని కొల్హాపుర్​ జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి.. తన ఇంట్లో వెంటిలేటర్ సపోర్ట్​ మీద ఉన్నాడు. విద్యుత్​ అంతరాయం కారణంగా వెంటిలేటర్​ పనిచేయక గురువారం మరణించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. కొల్హాపుర్​ జిల్లాలోని ఉచ్​గావ్​ గ్రామంలో అమేష్​ కాలే(38) అనే వ్యక్తి గత కొన్ని సంవత్సరాలుగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. కుటుంబసభ్యులు అతడిని ఇంట్లో వెంటిలేటర్​పై ఉంచారు. వారు ఉన్న ప్రాంతానికి మే 30న విద్యుత్​ సరఫరా నిలిచిపోయింది. అయినా తాత్కాలిక ఏర్పాట్లు చేశారు కుటుంబసభ్యులు. కొన్ని రోజులు పనిచేసిన వెంటిలేటర్​.. గురువారం​ పనిచేయలేదు. దీంతో అతడు ఊపిరాడక మరణించాడు. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లినా లాభం లేకుండా పోయింది. ఆ తర్వాత అతడి కుటుంబసభ్యులు ఆసుపత్రి బయట బాధితుడి మృతదేహంతో ధర్నా చేపట్టారు. పోలీసులు వచ్చి సర్దిచెప్పడం వల్ల మృతదేహాన్ని తీసుకుని ఇంటికి వెళ్లారు.

ఇవీ చదవండి: నడిరోడ్డుపై ఆర్టీఐ కార్యకర్తను కాల్చి చంపిన దుండగులు

జాబ్​ స్కామ్ కేసులో.. కేంద్ర మంత్రి, మరో భాజపా ఎంపీపై కేసు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.