ETV Bharat / bharat

లఖింపుర్​ ఘటనపై చర్చకు పట్టు- ఉభయసభలు సోమవారానికి వాయిదా

author img

By

Published : Dec 17, 2021, 12:21 PM IST

Updated : Dec 17, 2021, 2:54 PM IST

శుక్రవారం ప్రారంభమైన కొద్దిసేపటికే పార్లమెంట్​ ఉభయసభలు వాయిదా పడ్డాయి. లఖింపుర్​ ఖేరి ఘటనపై చర్చించాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగింది.

parliament adjourned
పార్లమెంట్​

Rajya Sabha Adjourned: లఖింపుర్​ ఖేరి హింసాత్మక ఘటనపై విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్​ అట్టుడుకుతోంది. ఉభయసభలు సోమవారానికి వాయిదా పడ్డాయి.

Lakhimpur Kheri Case: శుక్రవారం రాజ్యసభ ప్రారంభమైన క్రమంలోనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. లఖింపుర్​పై చర్చ చేపట్టాలని, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే, ఎంపీలపై సస్పెన్షన్​ ఎత్తివేయాలని కోరారు. ఈ క్రమంలో.. సభను సోమవారం వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు ఛైర్మన్​ వెంకయ్యనాయుడు. సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ అధ్యక్షుడు పీయూష్​ గోయల్​ సహా ప్రతిపక్షనేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

"సభ అధ్యక్షుడు సహా పలువురు సీనియర్​ నేతలతో చర్చించి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సభలో జరగాల్సిన చర్చలపై ఎంపీలు ఏకాభిప్రాయానికి రావాలి. దీనిపై మీరు చర్చించేందుకు వీలుగా సభను సోమవారానికి వాయిదా వేస్తున్నాను."

-వెంకయ్యనాయుడు, రాజ్యసభ ఛైర్మన్

Lok Sabha Adjourned

లోక్​సభ శుక్రవారం ప్రారంభమైన వెంటనే ప్రతిపక్ష నేతలు నిరసనలకు దిగారు. విపక్షాల నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు స్పీకర్​ ఓంబిర్లా. అయితే ఆందోళనలు ఉద్ధృతంగా మారటం వల్ల సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు​.

తిరిగి ప్రారంభమయ్యాక మళ్లీ సభకు అంతరాయం కలిగింది. లఖింపుర్​ ఖేరి ఘటనపై ఎంపీలు ఆందోళనలు చేశారు. కేంద్ర మంత్రి అజయ్​ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్​ చేశారు. ఈ నేపథ్యంలో దిగువ సభను డిసెంబర్​ 20కి వాయిదా వేశారు.

Surrogacy Bill 2021

అంతకుముందు విపక్ష సభ్యుల నినాదాల నడుమే.. సరోగసీ నియంత్రణ బిల్లు లోక్​సభ ఆమోదం పొందింది.

ఒక మహిళ వేరే దంపతుల బిడ్డకు జన్మనివ్వడాన్ని సరోగసీ అంటారు.

సరోగసీ పేరుతో జరిగే వ్యాపారానికి, అంటే 'అద్దె గర్భం' విధానానికి అడ్డుకట్ట వేయడం ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం. నైతికత, నిస్వార్థంతో సరోగసీ విధానం ద్వారా బిడ్డకు జన్మనివ్వడానికి ఈ చట్టం ఎలాంటి అడ్డంకులు సృష్టించదు.

ఇదీ చూడండి : Children Aadhaar: నవజాత శిశువులకు ఆసుపత్రుల్లోనే ఆధార్‌!

Last Updated :Dec 17, 2021, 2:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.