ETV Bharat / bharat

పేద విద్యార్థులకు LIC స్కాలర్​షిప్​ - అప్లై చేసుకోండిలా!

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 1, 2024, 10:51 AM IST

LIC Golden Jubilee Scholarship 2023 In Telugu : ప్రభుత్వ రంగ బీమా సంస్థ అయిన LIC పేద విద్యార్థులకు 'ఎల్​ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్​షిప్​ స్కీమ్'​ ద్వారా ఉపకార వేతనం అందిస్తోంది. డిగ్రీ, డిప్లొమా, ఇంజినీరింగ్, మెడిసిన్​, ఒకేషనల్​ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు ఇందుకు అర్హులు. పూర్తి వివరాలు మీ కోసం.

LIC Scholarship 2023
LIC Golden Jubilee Scholarship 2023

LIC Golden Jubilee Scholarship 2023 : లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) గోల్డెన్​ జూబ్లీ స్కాలర్​షిప్​ స్కీమ్​-2023 పేరుతో పేద విద్యార్థులకు ఉపకారవేతనాన్ని అందించనుంది. ప్రతిభ ఉండి కూడా, ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్య అభ్యసించలేకపోతున్న వారికి ఈ స్కాలర్​షిప్​ ఇవ్వనుంది. అర్హులైన విద్యార్థులు జనవరి 14లోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హతలు
LIC Scholarship Eligibility :

  • జనరల్‌ స్కాలర్‌షిప్‌ : 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60% మార్కులతో 10+2 (ఇంటర్‌)/ డిప్లొమా క్వాలిఫై అయ్యుండాలి. అలాగే ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ విద్యా సంస్థల్లో ఏదైనా డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్, డిప్లొమా, వృత్తి విద్య లేదా తత్సమానమైన కోర్సులు చేస్తుండాలి. ముఖ్యంగా విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000లోపు ఉండాలి.
  • స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్‌ : 10వ తరగతి తర్వాత బాలికల ఉన్నత విద్యను ప్రోత్సహించేందుకు ఎల్​ఐసీ ఈ స్కాలర్​షిప్​ స్కీమ్​ను తీసుకొచ్చింది. 2022-23 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్, ఒకేషనల్‌, డిప్లొమా, ఐటీఐ కోర్సు అభ్యసిస్తుండాలి. ప్రధానంగా అభ్యర్థిని తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,50,000 మించి ఉండకూడదు.

స్కాలర్​షిప్​
LIC Scholarship Amount :

  • మెడిసిన్‌ విద్యార్థులకు జనరల్​ స్కాలర్​షిప్​ కింద ఏటా రూ.40వేలు ఇస్తారు. దీనిని మూడు విడతలుగా (రూ.12000/ రూ.12000/ రూ.16000) అందిస్తారు.
  • ఇంజినీరింగ్‌ విద్యార్థులకు జనరల్​ స్కాలర్​షిప్​గా ఏడాదికి రూ.30వేలు ఇస్తారు. దీనిని మూడు విడతల్లో (రూ.9000/ రూ.9000/ రూ.12000) చెల్లిస్తారు.
  • డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ కోర్సులు, డిప్లొమా, ఒకేషనల్‌ కోర్సులు చేసేవారికైతే, ఆ కోర్సు పూర్తయ్యేవరకు ఏటా రూ.20వేలు చొప్పున జనరల్ స్కాలర్​షిప్ ఇస్తారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా (రూ.6000/ రూ.6000/ రూ.8000) విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
  • స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు ఏటా రూ.15 వేలు చొప్పున అందిస్తారు. పదో తరగతి పూర్తయిన తర్వాత ఇంటర్‌, ఒకేషనల్‌/ డిప్లొమా కోర్సులను పూర్తి చేసేందుకు ఈ మొత్తాన్ని మూడు దఫాలుగా (రూ.4500/ రూ.4500/ రూ.6000) చెల్లిస్తారు.

ఎంపిక విధానం
LIC Golden Jubilee Scholarship Selection Process : 10వ తరగతి, ఇంటర్​లో పొందిన మార్కుల మెరిట్​ + విద్యార్థి/ విద్యార్థిని కుటుంబ ఆర్థిక పరిస్థితుల ఆధారంగా ఈ స్కాలర్​షిప్​నకు ఎంపిక చేస్తారు. అల్పాదాయ వర్గాలవారికి ప్రథమ ప్రాధాన్యం ఉంటుంది.

దరఖాస్తు విధానం
LIC Golden Jubilee Scholarship Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఎల్​ఐసీ అధికారిక వెబ్​సైట్​ https://licindia.in/ ఓపెన్ చేయాలి.
  • Apply for Golden Jubilee Scholarship Scheme 2023 అనే లింక్​పై క్లిక్​ చేసి, ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత వివరాలు, కుటుంబ వార్షిక ఆదాయం, బ్యాంక్​ ఖాతా వివరాలు, కోర్స్ డ్యురేషన్​ తదితర వివరాలను నమోదు చేయాలి.
  • వివరాలు అన్నీ మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్​ను సబ్మిట్​ చేయాలి.
  • వెంటనే మీ మెయిల్​ అడ్రస్​కు అక్నాలెడ్జ్​మెంట్ లెటర్ వస్తుంది.
  • అందుకే సరైన ఈ-మెయిల్​, ఫోన్​ నంబర్లను ఇవ్వాల్సి ఉంటుంది.

దరఖాస్తు చేయడానికి ఆఖరు తేదీ
LIC Golden Jubilee Scholarship Apply Last Date : 2024 జనవరి 14

కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ 5 హక్కుల గురించి కచ్చితంగా తెలుసుకోండి!

How To Success In Interview : ఇంటర్వ్యూకు సిద్ధం అవుతున్నారా?.. ఈ టిప్స్​ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.